తెలంగాణ

telangana

ETV Bharat / sports

గుజరాత్ కథ ముగిసింది - ఎవరివో ఆ మూడు బెర్తులు? - IPL 2024 PlayOffs - IPL 2024 PLAYOFFS

IPL 2024 PlayOffs : ఐపీఎల్‌ 2024లో కేకేఆర్​కు ప్లేఆఫ్స్‌ బెర్త్​ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఎంఐ, పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించగా ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ కూడా వైదొలిగింది. దీంతో మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది . మరి ఇంతకీ ఆ జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

The Associated Press
IPL 2024 PlayOffs (The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 6:50 AM IST

IPL 2024 PlayOffs :ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్లేఆఫ్స్‌ బెర్త్​ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఒకదాని తర్వాత మరొకటి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగాయి. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ కథ కూడా ముగిసిపోయింది. దీంతో మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది . మరి ఇంతకీ ఆ జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

రాజస్థాన్‌ రాయల్స్​ 12 మ్యాచులు ఆడి 8 విజయాలను ఖాతాలో వేసుకుంది. మొదటి 9 మ్యాచ్‌ల్లోనే 8 విజయాలు సాధించింది. కానీ తర్వాత వరుసగా మూడు పరాజయాలను అందుకుంది. అయినా కూడా రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్​కు ఎలాంటి ఢోకా లేదు. తాను ఆడబోయే చివరి 2 మ్యాచ్‌ల్లో(పంజాబ్​పై, కోల్​కతాపై) కనీసం ఒక్కటి గెలిచినా కూడా ఆ జట్టుకు బెర్త్​ కన్ఫామ్​ అవుతుంది. ఒకవేళ రెండింటిలోనూ విజయం సాధిస్తే అగ్రస్థానంలో ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీ ముందుకు వెళ్తుంది. కానీ ఆ మ్యాచ్‌ల్లో రాజస్థాన్​ మరీ దారుణంగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితేనే ఇప్పుడున్న 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ బెర్తును దక్కించుకుంటుంది.

రాజస్థాన్‌ తర్వాత సన్​రైజర్స్​ హైదరాబాద్‌కు ప్లే ఆఫ్స్​ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఈ జట్టు 12 మ్యాచులు ఆడి 7 విజయాలను నమోదు చేసింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ (గుజరాత్‌, పంజాబ్‌) గెలిస్తేనే నేరుగా ప్లేఆఫ్స్​కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం నెట్‌ రన్‌రేట్‌ మంచిగా ఉంది (+0.406) కాబట్టి ఒక్క మ్యాచ్​లో గెలిచినా ముందడుగు వేస్తుంది. ఒకవేళ రెండు మ్యాచుల్లో ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల రిజల్ట్​పై ఆధారపడాల్సి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్​ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. తన చివరి మ్యాచులో ఆర్సీబీని ఓడిస్తే ముందడుగు వేసినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (+0.528) చాలా మెరుగ్గా కనిపిస్తోంది. కాబట్టి ఇతర మ్యాచ్‌ల రిజల్ట్​తో సంబంధం లేకుండానే ప్లేఆఫ్స్‌ బెర్త్​ను ఖరారు చేసుకోవచ్చు.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్​, దిల్లీ క్యాపిటల్స్​ చెరో 6 విజయాలు ఖాతాలో వేసుకున్నాయి. అయితే ఈ రెండు జట్లు కూడా నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనకున్నాయి. లఖ్‌నవూ.. దిల్లీ క్యాపిటల్స్​, ముంబయి ఇండియన్స్​తో తలపడాల్సి ఉంది. లఖ్‌నవూపై దిల్లీ పరాజయం పొందితే ఆ జట్టు కథ ముగిసిపోతుంది. ఎందుకంటే ఆ జట్టుకు అదే ఆఖరి మ్యాచ్‌. దిల్లీపై లఖ్‌నవూ ఓడినా ఆ జట్టు కథ కూడా దాదాపుగా ముగిసిపోతుంది. ఎందుకంటే లఖ్​నవూ నెట్‌రన్‌రేట్‌ (-0.769) చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయాన్ని అందుకున్నా ముందడుగు వేయడం కష్టమే.

ఆర్సీబీ మొదటి ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 ఓడి ప్లేఆఫ్స్‌కు కష్టమే అన్నట్టుగా కనిపించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా తర్వాతి 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి రేసులోకి వచ్చింది. ఆ జట్టుకు కాస్త సమీకరణాలు కలిసొస్తే ముందడుగు వేస్తుంది. నెట్‌రన్‌రేట్‌ (+0.387) మెరుగ్గా ఉండడం కూడా ఈ జట్టుకు కలిసొచ్చే విషయం.

సన్​రైజర్స్​ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్​, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్​ జట్లలో ఒక్కటే ముందడుగు వేసి ఇతర రెండు జట్లు వైదొలిగితే అప్పుడు చెన్నై-బెంగళూరు మధ్య పోరు నాకౌట్‌గా మారుతుంది. బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్​కు దిగితే 18 పరుగుల తేడాతో, తర్వాత ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించగలిగితే సీఎస్కేను వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌ చేరొచ్చు.

వర్షం ఎఫెక్ట్ - గుజరాత్, కోల్​కతా మ్యాచ్ రద్దు - IPL 2024

అభిమానులెవరూ ఊహించనిది - ప్లే ఆఫ్స్ ఆశల పల్లకిలో ఆర్సీబీ - IPL 2024

ABOUT THE AUTHOR

...view details