IPL 2024 mi vs CSk :రీసెంట్‌గానే ఫామ్‌లోకి వచ్చిందనుకున్నముంబయి వరుస విజయాలకు బ్రేక్ వేసింది చెన్నై. మాస్టర్ మైండ్ ధోనీ వ్యూహాలతో వాంఖడే వేదికగా చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. రోహిత్ సెంచరీతో రాణించినా మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో జట్టుకు పరాజయం తప్పలేదు. చెన్నై యువ బౌలర్ చేతిలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్య చేధనలో చతికిలబడింది ముంబయి.
అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ సిక్సులే కాదు మరికొన్ని ప్రత్యేకమైన గణాంకాలు నమోదయ్యాయి.
- ఐపీఎల్‌లో రోహిత్ శర్మకిది రెండో సెంచరీ. అంతేకాకుండా ముంబయి ఇండియన్స్ తరపున మూడో అత్యుత్తమ స్కోరు కూడా. 2008లో చెన్నైపైన సనత్ జయసూర్య 114పరుగులు చేయగా, రోహిత్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు చేశాడు.
- ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ బాదిన సెకండ్ ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. 36 సంవత్సరాల 350 రోజుల వయసులో రోహిత్ సెంచరీ పూర్తి చేస్తే, వీరేంద్ర సెహ్వాగ్ 35 ఏళ్ల 222 రోజుల వయసులో శతకం బాదాడు. అయితే సెహ్వాగ్ కూడా తన శతకాన్ని చెన్నై జట్టుపైనే కొట్టడం విశేషం.
- అత్యంత వేగంగా 2వేల ఐపీఎల్ పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. 58 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్ సాదించడం విశేషం. అంతకంటే ముందు 60 ఇన్నింగ్స్‌లలో 2వేల పరుగులు చేశాడు కేఎల్ రాహుల్.
- ధోనీ ఒక్కసారిగా టైంను వెనక్కు తీసుకెళ్లి, వింటేజ్ స్టైల్ లో పరుగులు బాదాడు. నాలుగు బంతుల్లోనే 20 పరుగులు (3 సిక్సులు) బాది స్టేడియాన్ని ఒక్క ఊపు ఊపాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అతను 5వేల పరుగులు సాధించాడు.
- అతి చిన్న వయస్సులో సీఎస్కే తరపున ఆడి నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ పతిరస. 21 ఏళ్ల 118 రోజుల వయస్సులో (4/28)తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
- సీజన్‌లో ఇప్పటివరకూ 8 డెత్ ఓవర్లు బౌలింగ్ వేసి 6 వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు.
- ఐపీఎల్‌లో వ్యక్తిగత సెంచరీ దాటినా జట్టు గెలవని మూడో సందర్భం ఇదే. 2021వ సీజన్లో పంజాబ్ జట్టు కోసం ఆడి సంజూ శాంసన్ 119 పరుగులు, 2010వ సీజన్లో ముంబయి జట్టుకు ఆడి 100 పరుగులు చేయగా రోహిత్ శర్మ 2024వ సీజన్లో ముంబయికు ఆడి 105పరుగులు చేశాడు.