IPL 2024 KKR VS RCB Funny Memes :ఈ సాలా కప్ నామ్‌దే అంటూ ఐపీఎల్ 17వ సీజన్‌లో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరిచింది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడినా రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి గాడిన పడినట్లే అనిపించింది. కానీ మూడో మ్యాచ్‌లో కోల్‌కత్తా చేతిలో పరాజయం పాలైంది. ఓపక్క ఆర్సీబీ మహిళల జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచి సత్తా చాటగా ఈసారి ఆర్సీబీ పురుషుల జట్టు కూడా టైటిల్ సాధిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే మరోసారి ఆర్సీబీ ప్రదర్శన అభిమానులకు నిరాశ తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మహిళలను జట్టులోకి తీసుకోవాలంటూ మీమ్స్ నెట్టింట వైరల్‌గా చేస్తున్నారు. మీమ్స్‌తో ఆర్సీబీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు - ఈ ఫన్నీ మీమ్స్ చూశారా? - IPL 2024 KKR VS RCB - IPL 2024 KKR VS RCB
IPL 2024 KKR VS RCB Funny Memes : కోల్‌కతా చేతిలో సొంత మైదానంలో ఓడిపోవడంతో ఆర్సీబీపై సెటైర్లు పేలుతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అవి చూసేద్దాం.
ఆర్సీబీ ఫన్నీ మీమ్స్
Published : Mar 30, 2024, 9:41 AM IST