IPL 2024 KKR VS Delhi Capitals Captain Rishab pant Fined : వైజాగ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ భారీ తేడాతో ఓడిపోయింది. కోల్‌కతా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో 106 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడి కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
పంత్‌కు డబుల్ షాక్ - దిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తానికి కూడా - IPL 2024 KKR VS DC - IPL 2024 KKR VS DC
IPL 2024 KKR VS Delhi Capitals Captain Rishab pant Fined : పంత్‌తో పాటు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డబుల్ షాక్ తగిలింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వాళ్లు చేసిన తప్పిదం కారణం ఐపీఎల్ నిర్వాహకులు ఈ షాకిచ్చారు.
Published : Apr 4, 2024, 11:15 AM IST
అయితే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్ తగిలింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మళ్లీ దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్‌కు, జట్టులోని ఇతర సభ్యులకూ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. అయితే ఇది రెండోసారి కావడం వల్ల ఎక్కువ మొత్తంలో జరిమానా పడే అవకాశం ఉంది. పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధిస్తూ అధికారులు ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం - ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని జరిమానాగా విధిస్తారు.