IPL 2024 Duck Out List : ఐపీఎల్ 2024 సీజన్ కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ. అతడి పేరు మీద ఓ పేలవ రికార్డు కూడా ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక గోల్డెన్ డక్‌లు చేసిన ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ మొదటి స్థానంలో ఉంటే హిట్ మ్యాన్ రెండో స్థానంలో ఉన్నాడు. మరి ఆ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారో తెలుసుకుందాం.
దినేశ్ కార్తీక్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు చెందిన దినేశ్ కార్తీక్ 242 మ్యాచుల్లో 17సార్లు డకౌట్ అయ్యాడు. కొన్ని సీజన్లలో కోల్ కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
రోహిత్ శర్మ : ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ ఇపీఎల్లో 243 మ్యాచులు ఆడి 16 సార్లు డకౌట్ అయ్యాడు. ముంబయి ఇండియన్స్ సారథిగా 5 సార్లు టైటిల్ గెలిచిన రికార్డ్ రోహిత్ శర్మ సొంతం.
సునీల్ నరైన్ : ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సున్నాలో ఔట్ అయిన రికార్డు వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అతడు 162 మ్యాచులు ఆడాడు. అందులో 15 సార్లు సున్నాలో ఔట్ అయ్యాడు.
మన్‌దీప్ సింగ్ : ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా మన్‌దీప్ సింగ్ కూడా రికార్డుకెక్కాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 111 మ్యాచుల్లో 15 సార్లు సున్నాకి ఔట్ అయ్యాడు మన్‌దీప్ సింగ్.
రషీద్ ఖాన్ : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ 109 ఇన్నింగ్స్‌లో 14 సార్లు డకౌట్ అయ్యాడు. 2023లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.