తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్‌ 2024 స్పీడ్​ గన్​ మయాంక్​కు ఏమైంది? - IPL 2024 GT VS LSG

IPL 2024 Mayank Yadav : యువ ఫాస్ట్‌ బౌలర్ మయాంక్‌ యాదవ్​కు ఏమైందా అని క్రికెట్ ప్రియుల మదిలో అనుమానాలు మెదులుతున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఐపీఎల్‌ 2024 స్పీడ్​ గన్​ మయాంక్​కు ఏమైంది?
ఐపీఎల్‌ 2024 స్పీడ్​ గన్​ మయాంక్​కు ఏమైంది?

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 1:38 PM IST

IPL 2024 Mayank Yadav : ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన పేస్​తో ఆకట్టుకున్నాడు యువ ఫాస్ట్‌ బౌలర్ మయాంక్‌ యాదవ్. నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ సామాన్య క్రికెట్ ప్రియులు నుంచి స్టార్‌ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా గుజరాత్‌ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం ఒకే ఒక్క ఓవర్‌ మాత్రమే సంధించి మైదానాన్ని వీడాడు.

దీంతో అతడికి ఏమైందనే? అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతున్నాయి. అయితే దీనిపై కెప్టెన్ కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య మ్యాచ్‌ అనంతరం మాట్లాడారు. మయాంక్‌ పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. కానీ అతడికి సరిగ్గా ఏమైందనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు.

అయితే బయట దొరికే ఇతర ఇంగ్లీష్ మీడియా కథనాల్లో అతడికి గాయం అయినట్లు రాసి ఉంది. అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లు తెలిసింది. స్కానింగ్ చేసిన తర్వాతనే ఇతడి గాయం తీవ్రతపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికైతే లఖ్‌నవూ ఫ్రాంచైజీ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు.

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్​లో అతడు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుపై 156.7 కి.మీ వేగంతో బంతులను సంధించాడు. ఈ సీజన్‌లో ఇదే మొదటి అత్యంత వేగవంతమైన బంతి కావడం విశేషం. అనంతరం అతడు పంజాబ్‌ కింగ్స్ జట్టుపైనా 155.8 కి.మీ స్పీడ్‌తో బాల్​ను వేశాడు. అయితే అతడు పేసర్‌ కావడం వల్ల గాయాల బారిన పడటం సహజమనే చెప్పాలి. ఇకపోతే మయాంక్ గత రెండు సీజన్లలోనూ గాయాల వల్ల రిజర్వ్‌ బెంచ్‌లోనే ఉన్నాడు. రీసెంట్​గా రంజీ ట్రోఫీ సమయంలోనూ అతడి గాయం తిరగబెట్టింది. ఇప్పుడు మళ్లీ మూడు మ్యాచ్‌లు ఆడంగానే అతడు గాయపడటం ఫ్యాన్స్​ను బాగా ఆందోళనకు గురి చేస్తోంది. చూడాలి మరి అతడు ఎంత తర్వగా కోలుకుంటాడో.

హ్యారీ బ్రూక్ స్థానంలో అతడు - ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్​కు దూరమైన ఇంగ్లాండ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు లిజాద్‌ విలియమ్స్‌ను తీసుకున్నట్లు దిల్లీ ఫ్రాంచైజీ అఫీషిల్​గా అనౌన్స్ చేసింది. లిజాద్ నేషనల్ టీమ్ తరఫున 4 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. అతడిని కనీస ధర రూ.50 లక్షలకు దిల్లీ కొనుగోలు చేసింది. అతడు టీ20 ఛాలెంజ్‌లో టైటాన్స్‌ తరఫున 9 మ్యాచ్‌లు, ఈ ఏడాది SA20 సీజన్‌లో సూపర్‌ కింగ్స్‌కు తరఫున తొమ్మిది మ్యాచులు ఆడాడు. SA20 తాజా సీజన్​లో 15 వికెట్ల వరకు తీశాడు. కాగా, ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్​ ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరన ఉంది.

మయంక్ అవి బంతులా? బుల్లెట్లా?- లఖ్​నవూకు స్పీడ్‌ గన్‌ దొరికేసింది! - Mayank Yadav IPL 2024

నయా స్పీడ్ గన్​కు షూ స్పాన్సర్లు లేరట!- మయంక్ టార్గెట్ అదే - Mayank Yadav IPL 2024

ABOUT THE AUTHOR

...view details