తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 2024 - ఈ ప్లేయర్లకు ఇదే ఫస్ట్ టైమ్ గురూ! - IPL debutants to watch out for 2024

IPL 2024 Debutants Players : ప్రతి సారిలాగే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కూడా చాలా మంది భారత, విదేశీ క్రికెటర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో మొదటిసారి ఐపీఎల్‌ ఆడబోతున్న ఆటగాళ్లు ఎవరు? ఏ టీమ్‌ తరఫున బరిలో దిగుతున్నారో చూద్దాం.

IPL Debutants Players 2024
IPL Debutants Players 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 8:34 PM IST

Updated : Mar 16, 2024, 8:50 PM IST

IPL 2024 Debutants Players : క్రికెట్ లవర్స్​కు ప్రస్తుతం ఐపీఎల్​ ఫీవర్‌ మొదలైపోయింది. ఇటు అభిమానులకు అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అటు ఆటగాళ్ల ప్రతిభకి తగిన గుర్తింపు అందిస్తుండటంతోనే ఈ ఫార్మాట్ సూపర్‌ సక్సెస్‌ అయింది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి టీమ్‌ ఇండియాలో స్టార్‌ ప్లేయర్‌లుగా ఎదిగిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే యంగ్‌ క్రికెటర్‌లు అందరూ ఐపీఎల్‌లో సత్తా చాటాలని, బీసీసీఐ దృష్టిలో పడాలని కోరుకుంటారు.

షమర్ జోసెఫ్
వెస్టిండీస్‌ బౌలింగ్‌ సంచలనం షమర్ జోసెఫ్‌ను లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ప్లేయర్ మార్క్ వుడ్‌కి రీప్లేస్‌మెంట్‌గా జోసెఫ్‌కి అవకాశం ఇచ్చింది. గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియాను వణికించి, వెస్టిండీస్‌కి విజయాన్ని అందించిన జోసెఫ్‌ ఇప్పుడు తన మొదటి ఐపీఎల్‌ పోరకు సిద్ధంగా ఉన్నాడు.

రచిన్ రవీంద్ర
భారతదేశ మూలాలున్న న్యూజిలాండ్ ఆటగాడు రచిన్‌ రవీంద్ర గురించి చాలామంది వినే ఉంటారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఈ యంగ్‌ క్రికెటర్‌ అద్భుతంగా రాణించాడు. ఇక రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.80 కోట్లకు సొంతం చేసుకుంది.

గెరాల్డ్‌ కోయెట్జీ
దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక కోయొట్జీని ముంబయి ఇండియన్స్ రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్​ 2021 సీజన్​ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు అతడ్ని ఎంపిక చేసింది కానీ గెరాల్డ్ ఆ సీజన్​ ఆడలేదు.

అర్షిన్ కులకర్ణి
2024 అండర్ 19 ప్రపంచ కప్​లో సూపర్ పెర్ఫామెన్స్​తో అదరగొట్టాడు యంగ్ టీమ్ఇండియా ప్లేయర్ అర్షిన్‌ కులకర్ణి. తాజాగా జరిగిన ఐపీఎల్‌ వేలంలో అర్షిన్‌ని లఖ్​నవూ జట్టు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

సమీర్ రిజ్వి
మేరఠ్​కు చెందిన యంగ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ, ఎంఎస్‌ ధోని సారథ్యంలో తన మొదటి ఐపీఎల్ పోరును ఆడనున్నాడు. ఇతడ్ని మినీ వేలంలో చెన్నై ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది.

స్పెన్సర్ జాన్సన్
ఈ సారి జరిగిన మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్‌ను రూ.10 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఈ నయా బౌలర్‌కి కూడా ఇదే మొదటి ఐపీఎల్‌ సీజన్‌.

రాబిన్ మిన్జ్
ఝార్ఖండ్‌కి చెందిన లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ రాబిన్‌ మిన్జ్‌ని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక రాబిన్‌ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌ కూడా చేయగలడు.

షాయ్ హోప్
వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్ అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు పొందాడు. ఆ జట్టు విజయాల్లో ఈ స్టార్ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు. రానున్న ఐపీఎల్ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున తొలిసారి బరిలో దిగుతున్నాడు. ఇతడు వేలంలో రూ.75 లక్షలు అందుకున్నాడు.

అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌
వన్డే ప్రపంచ కప్ 2023లో జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందిస్తూ సత్తా చాటాడు అఫ్గానిస్థాన్ ఆల్‌ రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌. ఇప్పుడు ఐపీఎల్​లోనూ తన మెరుపులు చూపించేందుకు రెడీగా ఉన్నాడు. ఇతడ్ని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

లాస్ట్ సీజన్​ మిస్​- నయా జోష్​తో రీ ఎంట్రీ- 2024లో కమ్​బ్యాక్​ పక్కా!

IPLలో హై వోల్టేజ్ మ్యాచ్​లు- ఈ జట్ల మధ్య పోరు కిక్కే వేరప్ప

Last Updated : Mar 16, 2024, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details