IPL 2024 CSK VS Mumbai Indians : ఐపీఎల్-2024లో తాజాగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. 20 పరుగుల తేడాతో ముంబయి ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ధోనీ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచాయి.
Rohit IPL Century : లక్ష్యాన్ని ఛేదించలేక ముంబయి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ రోహిత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒంటరి పోరాటం చేస్తూ దూసుకెళ్లాడు. అలా ఆఖరి వరకు అద్బుతంగా పోరాటం చేసి ఫ్యాన్స్‌ను అలరించాడు. అతడికి మరో ఆటగాడి అండ దొరికే ఉంటే ముంబయి కచ్చితంగా విజయం సాధించి ఉండేది. అతడు 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 103 అజేయ పరుగులు చేశాడు. రోహిత్‌కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. చివరగా అతడు 2012 ఐపీఎల్ సీజన్‌లో శతకం బాది ఆకట్టుకున్నాడు. కాగా, రోహిత్ సెంచరీ బాదినప్పటికీ ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు.
అలానే హిట్ మ్యాన్ ఓ రికార్డు కూడా సాధించాడు. టీ20ల్లో 500 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ మార్క్ అందుకున్న ఐదో బ్యాటర్‌గానూ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ముందు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, కీరన్ పొలార్డ్ (860), ఆండ్రూ రస్సెల్ (678), కొలిన్ మున్రో (548) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.