తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుట్టుకతోనే దృష్టిలోపమున్నా వరల్డ్ ఛాంపియన్​గా ఘనత - భర్తే కోచ్​! - Simran Sharma World Champion

Simran Sharma World Champion : జ‌పాన్ వేదిక‌గా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2024లో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ - మహిళల 200 మీటర్ల గోల్డ్ మెడల్ సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్న ఈమె ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
Simran Sharma (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 1:00 PM IST

Simran Sharma World Champion :జ‌పాన్ వేదిక‌గా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2024లో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ - మహిళల 200 మీటర్ల గోల్డ్ మెడల్ సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. కేవ‌లం 24.95 సెకన్లలోనే ప‌రుగు పూర్తి చేసి దేశానికి ఆరో స్వర్ణాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఈ పసిడిని ముద్దాడటం తనలో మ‌రింత ఆత్మ విశ్వాసాన్ని నింపిందని పేర్కొంది. అయితే ఛాంపియ‌న్‌గా నిలిచిన సిమ్రాన్ వెనక ఎంతో క‌ష్టం దాగి ఉంది. పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్న ఈమె ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడ తన భర్త సాయంతోనే ఆమె ఇదంతా సాధించడం కూడా ఎందరో జంటలకు ఆదర్శంగా నిలిచింది.

నెలలు నిండకుండానే దృష్టి లోపంతో - సిమ్రాన్ పూర్తిగా నెల‌ల నిండ‌కుండానే, ఆరున్నార నెలలకే పుట్టింది. అందులోనూ దృష్టి లోపంతో. ఆమె జన్మించగాే దాదాపు నెల రోజుల పాటు ఇంక్యుబేటర్‌లోనే ఉంచారట. అయితే వయసు పెరిగే కొద్ది చాలా మంది ఆమెను హేళ‌న చేసేవారు. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యం కోసమే ముందుకు నడిచింది. చివరికి తాను కన్న వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌ కలను నేరవేర్చుకుంది.

ప్రేమ పెళ్లి, భ‌ర్తే కోచ్‌ - సిమ్రాన్ ప్రపంచ ఛాంపియ‌న్‌గా నిలవ‌డంలో ఆమె భ‌ర్త గ‌జేంద్ర సింగ్‌ది కూడా కీల‌క పాత్ర‌. వీరిద్ద‌రిది ప్రేమ పెళ్లి. గ‌జేంద్ర సింగ్ ప్ర‌స్తుతం ఆర్మీలో పని చేస్తున్నారు. గజేంద్ర మొదట అంత‌ర్జాతీయ స్ధాయిలో అథ్లెట్‌గా రాణించాల‌ని అనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో తన సంపాదనతో ఆర్ధికంగా స్థోమ‌త లేని వారికి శిక్ష‌ణ ఇప్పించి వారి విజయాల్లో భాగం కావాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలోనే 2015లో దిల్లీలోని ఎమ్ఎమ్ కాలేజీ గ్రౌండ్‌లో సిమ్రాన్‌తో ఆయనకు పరిచయమైంది. సిమ్రాన్‌కు ఆయన కోచ్‌గానూ ఉన్నారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అయితే గజేంద్ర కుటుంబం వీరి పెళ్లిని ఒప్పుకోలేదు. కానీ గజేంద్ర ఫ్యామిలీని కాదని సిమ్రాన్​నే పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ త‌మ కుటంబాల‌కు దూరంగానే ఉంటున్నారు.

అయితే త‌న భార్య‌ కన్న కలను తన కలగా భావించాడు గజేంద్ర. అందుకు తగ్గట్టే కావాల్సిన శిక్షణను ఇప్పించి ఆమెను సిద్ధం చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తాన డ‌బ్బులు అవ‌స‌ర‌మైతే లోన్ తీసుకోవ‌డంతో పాటు త‌న పేరిట ఉన్న స్ధలాన్ని విక్ర‌యించారట. అలా ఈ జర్నీలో పలు టోర్నీలో పాల్గొన్న సిమ్రాన్​ గెలుపు ఓటములను, ఎత్తు పల్లాలను చూసింది. ఫైనల్​గా వరల్డ్ ఛాంపియన్​గా నిలిచింది.

ఫేక్‌ అప్లికేషన్స్​ - టీమ్​ఇండియా హెడ్​ కోచ్‌ రేసులో మోదీ, అమిత్​ షా!

55 మ్యాచ్‌లు, 20 జట్లు - టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే - T20 WORLD CUP 2024

ABOUT THE AUTHOR

...view details