Lakshya Sen Back Shot:కొందరు ప్లేయర్లు క్రీడల్లో అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తన టెక్నిక్‌తో అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. లక్ష్య ఆడిన షాట్ చూసి ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. నెట్‌లో ప్రత్యక్షమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నివ్వెరపోయిన పారిస్!
ప్రపంచ నెం.4వ ర్యాంక్ షట్లర్ జోనథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో బుధవారం లక్ష్యసేన్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య తన స్కిల్స్‌తో ఆందర్నీ ఆకట్టుకున్నాడు. తొలి సెట్‌లో 19-18తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి క్రిస్టీ నుంచి వేగంగా వచ్చిన కాక్కు లక్ష్య నమ్మశక్యం కాని రీతిలో బదులిచ్చాడు. తనవైపు వచ్చిన కాక్‌ను రివర్స్ షాట్ (Behind The Back Recovery Shot)తో అవతలి కోర్ట్లోకి పంపించాడు. లక్ష్యసేన్ ఆడిన ఈ షాట్ సెన్సేషనల్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.