తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌- ఐదోసారి ట్రోఫీ కైవసం - India Wins Asian Champions Trophy

India Wins Mens Asian Champions Trophy 2024 : ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్‌లో చైనాపై 1-0తో భారత జట్టు గెలుపొందింది.

India Wins Mens Asian Champions Trophy 2024
India Wins Mens Asian Champions Trophy 2024 (IANS)

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 5:25 PM IST

Updated : Sep 17, 2024, 7:16 PM IST

India Wins Mens Asian Champions Trophy 2024 :ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. చైనా వేదికగా జరిగిన ఈ ఏడాది ఎడిషన్‍లో అదిరే ఆటతో టైటిల్ సాధించింది. నేడు (సెప్టెంబర్ 17) జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‍లో భారత్ 1-0 తేడాతో ఆతిథ్య చైనాపై సూపర్ విజయం సాధించింది. దీంతో ఐదోసారి ఆసియా టైటిల్‍ను టీమ్​ఇండియా కైవసం చేసుకుంది. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. భారత్, చైనా మధ్య ఫైనల్ పోరు జోరుగా సాగింది. అయితే, 51న నిమిషంలో జుగ్‍రాజ్ సింగ్ గోల్ చేయటంతో భారత్ ఖాతా తెరిచింది. చైనా గట్టిపోటీనే ఇచ్చింది. 1-0తో గెలిచి టైటిల్ దక్కించుకుంది.

ఈ ఫైనల్‍లో ముందుగా భారత్ దూకుడుగా ఆడగా చైనా తడబడినట్టు కనిపించింది. కానీ ఆరంభంలో టీమ్​ఇండియా గోల్ సాధించలేదు. కాసేపటికే చైనా కూడా దీటుగా ఆడింది. ఆరో నిమిషంలో భారత ప్లేయర్ సుమీత్ గోల్ట్ పోస్ట్ వైపు బలమైన షాట్ కొట్టగా, చైనా గోల్ కీపర్ వాంగ్ విహావో అడ్డుకున్నాడు. 10వ నిమిషంలో వచ్చిన తొలి పెనాల్టీ కార్నర్‌ను భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్ మిస్ చేశాడు.

ఆ తర్వాత మరో పెనాల్టీ కార్నర్ వచ్చినా టీమ్​ఇండియాకు గోల్ మిస్ అయింది. 14వ నిమిషంలో సుఖ్‍జీత్ సూపర్ షాట్ కొట్టినా మరోసారి అడ్డుకున్నాడు చైనీస్ గోల్‍కీపర్ విహావో. భారత్‍కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. చైనా గట్టిపోటీ ఇచ్చింది. దీంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

రెండో అర్ధభాగం కూడా భారత్, చైనా జోరుగా ఆడాయి. గోల్స్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా హోరీహోరీగా ఆటగాళ్లు ఆడారు. దీంతో గోల్ ఎప్పుడొస్తుందా అనే ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ తరుణంలో 51వ నిమిషంలో జగ్‍రాజ్ సింగ్ గోల్ బాదాడు. చైనీస్ గోల్‍కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్ కొట్టాడు. దీంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది టీమ్​ఇండియా. చివరి వరకు దూకుడుగా ఆడింది. మొత్తంగా ఒక్క గోల్ తేడాతో చైనాపై భారత్ విజయం సాధించింది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించడం భారత్‍కు ఇది ఐదోసారి. డిఫెండింగ్ చాంపియన్‍గా బరిలోకి దిగిన హర్మన్‍ప్రీత్ సారథ్యంలోని టీమ్​ఇండియా మరోసారి ట్రోఫీ దక్కించుకుంది. 2011, 2016, 2018, 2023ల్లో టైటిల్ గెలిచిన భారత హాకీ జట్టు, ఇప్పుడు ఐదోసారి ఆసియా విజేతగా నిలిచింది. భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్ హీరో ఆఫ్ ది టోర్మమెంట్‍గా నిలిచాడు.

Last Updated : Sep 17, 2024, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details