తెలంగాణ

telangana

ETV Bharat / sports

356 రన్స్ లీడ్​లో టీమ్ఇండియా - పోరాడుతున్న బంగ్లాదేశ్ - Ind vs Ban Test Series 2024

Ind vs Ban Test 2024 : భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసరికి టీమ్ఇండియా ఇంకా 356 పరుగుల లీడ్​లో కొనసాగుతోంది.

India vs Bangladesh
India vs Bangladesh (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 21, 2024, 4:35 PM IST

Updated : Sep 21, 2024, 5:18 PM IST

Ind vs Ban Test 2024 :బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 515 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 158-4తో నిలిచింది. క్రీజులో నజ్ముల్ షాంటో (51 పరుగులు), షకిబ్ అల్ హసన్ (5 పరుగులు) ఉన్నారు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 3, పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.

515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఇన్నింగ్స్​ను ధీటుగా ఆరంభించింది. ఓపెనర్లు జకీర్ హసన్ (33 పరుగులు), షాద్​మన్ ఇస్టామ్ (35 పరుగులు) 16 ఓవర్లలోనే స్కోర్ 60 దాటించారు. ఈ దశలో పేస్ స్టార్ బుమ్రా టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. 16.2 ఓవర్​ వద్ద జకీర్​ను ఔట్ చేశాడు. డిఫెన్స్ ఆడబోతే స్లిప్​లోకి వెళ్లిన బంతిని జైశ్వాల్ అద్భుతంగా క్యాచ్​ పట్టుకున్నాడు. ఇక మరో ఓపెనర్​ ఇస్లామ్​ను అశ్విన్ పెవిలియన్ పంపాడు. మొమినుల్ హక్ (13 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (13 పరుగులు) ఈ ఇద్దర్నీ అశ్విన్ క్రీజులో కుదురుకోముందే ఔట్ చేశాడు.

అంతకుముందు సెకండ్ ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా ఓవర్​నైట్​ స్కోర్ 81- 3తో బ్యాటింగ్ కొనసాగించింది. యంగ్ బ్యాటర్లు ​యంగ్ బ్యాటర్ తొలి సెషన్ నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడారు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ (109 పరుగులు), శుభ్​మన్ గిల్ (119* పరుగులు) శతకాలతో అదరగొట్టారు. సెంచరీ తర్వాత పంత్ క్యాచౌట్​గా వెనుదిరిగాడు. కే ఎల్ రాహుల్ (22* పరుగులు) చేశాడు. ఇక 287-4 పరుగుల వద్ద టీమ్ఇండియా ఇన్నింగ్స్​ డిక్లేర్డ్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్​లో బంగ్లా బౌలర్లలో హసన్ మిరాజ్ 2, నహిద్ రానా, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Sep 21, 2024, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details