తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్, బంగ్లా టెస్ట్​ సిరీస్ - అశ్విన్​ను ఊరిస్తున్న టాప్​ 5 రికార్డులివే! - RAVICHANDRAN ASHWIN BIG RECORDS - RAVICHANDRAN ASHWIN BIG RECORDS

IND VS BAN Records Ravichandran Ashwin Could Break : మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్​తో జరగబోయే టెస్ట్‌ సిరీస్​కు టీమ్ ఇండియా సన్నద్ధమవుతోంది. అయితే నేడు(సెప్టెంబర్ 17) భారత స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్​ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్‌ అశ్విన్​ను బంగ్లా టెస్ట్​ సిరీస్​లో ఊరిస్తున్న టాప్​-5 ప్రపంచ రికార్డులు ఏంటో తెలుసుకుందాం.

source IANS
Ravichandran Ashwin (source IANS)

By ETV Bharat Sports Team

Published : Sep 17, 2024, 11:22 AM IST

IND VS BAN Records Ravichandran Ashwin Could Break :టీమ్ ఇండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో టెక్నిక్​గా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ప్రత్యర్థి బ్యాటర్లను మరింత బెంబేలెత్తిస్తాడు. అశ్విన్ క్యారమ్ బాల్ సంధించాడంటే ప్రత్యర్థులకు చుక్కలే. పిచ్‌ కొంచెం స్పిన్​కు సహకరించిందంటే వేరీ డేంజర్​గా మారిపోతుంటాడు. అనిల్ కుంబ్లే తర్వాత టీమ్ ఇండియా తరఫున అంతలా రాణించిన బౌలర్ ఆశ్విన్. ఈ రోజు ( సెప్టెంబరు 17) అశ్విన్ 38వ పడిలోకి అడుగుపెట్టాడు. అశ్విన్​కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

అయితే సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్​తో టీమ్ ఇండియా టెస్టు సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ఆటగాళ్లు నెట్స్​లో చెమటోడుస్తున్నారు. అశ్విన్ సైతం ప్రాక్టీస్​లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో జరగబోయే టెస్ట్​ సిరీస్​లో అశ్విన్ ముందున్న ప్రపంచ రికార్డులపై ఓ లుక్కేద్దాం.

స్వదేశంలో అత్యధిక వికెట్లు :టీమ్ ఇండియా తరఫున టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) రికార్డును బద్దలు కొట్టడానికి అశ్విన్ (516)కు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే సొంతగడ్డపై అనిల్ కుంబ్లే (476) వికెట్ల రికార్డును బద్దలు కొట్టడానికి అశ్విన్ మరో 22 వికెట్లు తీస్తే సరిపోతుంది. భారత గడ్డపై అశ్విన్ 455 వికెట్లు తీశాడు. బంగ్లా సిరీస్​లో ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొడతాడేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

బంగ్లాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా! -టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ రికార్డును బంగ్లాదేశ్​తో జరిగే టెస్టు సిరీస్​లో అశ్విన్​ బ్రేక్ చేసే అవకాశం ఉంది. భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా ప్రస్తుతం జహీర్‌ ఉన్నాడు. జహీర్ 7 టెస్టు మ్యాచుల్లో 31 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్​తో ఇప్పటివరకు 6 టెస్టులు ఆడిన అశ్విన్ 23 వికెట్లు తీశాడు. త్వరలో జరగబోయే సిరీస్​లో అశ్విన్ 9 వికెట్లు తీస్తే, భారత్-బంగ్లా మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ ఇండియా బౌలర్​గా అవతరిస్తాడు.

అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డ్​! -ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్‌ షిప్​లో అశ్విన్, ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్ లియాన్ ఇప్పటివరకు పది సార్లు 5 వికెట్లను తీశారు. దీంతో ఇద్దరూ అగ్రస్థానాన్ని సంయుక్తంగా పంచుకున్నారు. బంగ్లా సిరీస్​లో మరోసారి 5 వికెట్ల హాల్​ను పడగొట్టి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ నంబరు వన్​గా నిలవాలని అశ్విన్ భావిస్తున్నాడు. మరో రెండు సార్లు 5 వికెట్ల హాల్​ను తీస్తే టెస్టు క్రికెట్​లో షేన్ వార్న్(37) రికార్డును అశ్విన్ బద్దలు కొడతాడు.

అడుగు దూరంలో మరో రికార్డు -బంగ్లాదేశ్ సిరీస్​లో అశ్విన్ మ‌రో 14 వికెట్లు సాధిస్తే, ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్​లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్​గా నిలుస్తాడు అశ్విన్. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లైయ‌న్ 187 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్​ 174 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్​తో సిరీస్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా అశ్విన్ అవతరించే అవకాశం ఉంది. అశ్విన్ మరో 26 వికెట్లు సాధిస్తే వరల్ట్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా నిలుస్తాడు.

2023-25 సీజన్​లో హయ్యెస్ట్ వికెట్ టేకర్! -ప్రపంచ వరల్డ్ ఛాంపియన్ షిప్ 2023-2025 సీజన్​లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌ వుడ్ 51 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్(42) మరో పది వికెట్లు తీస్తే తొలిస్థానాన్ని దక్కించుకుంటాడు. ఇప్పటికే 100 టెస్టుల్లో 516 వికెట్లు తీసిన అశ్విన్ బంగ్లా సిరీస్​లో వాల్ష్(519), నాథన్ లియాన్(530)ను దాటేసే అవకాశం ఉంది.

అన్ని ఫార్మాట్లలోనూ అదుర్స్ -అశ్విన్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 281 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 744 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్​గా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు సెంచరీలు చేశాడు. చాలాకాలంగా వన్డే క్రికెట్​కు దూరంగా ఉన్న అశ్విన్‌ టెస్టుల్లో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరో రెండ్రోజుల్లో బంగ్లాదేశ్​తో జరగనున్న తొలి టెస్టుకు ఎంపికయ్యాడు.

రెండు టెస్టులు, మూడు టీ20లు
కాగా, భారత పర్యటనకు బంగ్లాదేశ్ రానుంది. చెన్నై వేదికగా సెప్టెంబరు 19 నుంచి 23 వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 27- అక్టోబరు 1 వరకు రెండో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. అక్టోబరు 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవ్వనుంది.

కోహ్లీని అడ్డుకునేందుకు బంగ్లా వ్యూహాలు - ఆ ముగ్గురు బౌలర్లతో కింగ్​కు ముప్పే! - India vs Bangladesh 2024

టెస్టు క్రికెట్​లో అత్యధిక పార్ట్​నర్​షిప్​ నమోదు చేసిన జోడీలివే! - టాప్​లో ఎవరున్నారంటే? - Longest Partnership in Test Cricket

ABOUT THE AUTHOR

...view details