India Vs Afghanistan T20 World Cup 2024 :టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న రోహిత్ సేన ఆచితూచి ఆడటం వల్ల నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. అఫ్గాన్ బౌలర్ల దాటికి తక్కువ స్కోరే చేసినప్పటికీ మన భారత ప్లేయర్లు తమ ఇన్నింగ్స్‌లో రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (53) అర్ధశతకంతో ఆకట్టుకోగా, హార్దిక్ పాండ్య (32), విరాట్ కోహ్లీ (24), రిషభ్ పంత్ (20) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఒపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (8) కాస్త నిరాశ పరిచాడు. అర్షదీప్ సింగ్ (2*) నాటౌట్‌గా నిలిచాడు. ఇక అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, నవీనుల్ హక్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, ఆదిలో దూకుడుగా ఆడిన అఫ్గాన్ ప్లేయర్లు క్రమంగా కుప్పకూలుతూ కనిపించారు. భారత బౌలర్ల దెబ్బకు ఎక్కువ పరుగులు తీయకుండానే వెనుతిరిగారు. దీంతో 11.2 ఓవర్లకే ఐదు వికెట్లను కోల్పోయారు. బుమ్రా (3/7)తో పాటు అర్ష్‌దీప్ (3/36), కుల్‌దీప్ (2/32) కూడా సత్తా చాటడం వల్ల అఫ్గాన్ 20 ఓవర్లలోనే 134 పరుగులు చేసి కుప్పకూలింది. 26 పరుగులు చేసిన అజ్మతుల్లానే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అతడు తప్ప మిగతా టీమ్ మెంబర్స్ ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు.