తెలంగాణ

telangana

ETV Bharat / sports

జింబాబ్వేతో టీ20 సిరీస్​ - కోహ్లీ, రోహిత్​, జడేజా స్థానాన్ని భర్తీ చేసేదెవరు? - India tour of zimbabwe 2024 - INDIA TOUR OF ZIMBABWE 2024

Teamindia VS Zimbabwe T20 series : జింబాబ్వే టీ20 సిరీస్‌కు బీసీసీఐ యంగ్‌ టీమ్‌ ఇండియాను పంపింది. కొత్తగా ఐదు మందికి అవకాశం కల్పించింది. మరి ఈ అవకాశాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఎవరికి ఉందో?

(source ANI and The Associated Press)
Zimbabwe VS TeamIndia T20 Series ((source ANI and The Associated Press))

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 9:44 PM IST

Teamindia VS Zimbabwe T20 series :జులై 6 శనివారం నుంచి జింబాబ్వే వర్సెస్‌ భారత్‌ టీ20 సిరీస్‌ మొదలు కానుంది. కొందరు సీనియర్లు టీ20కు రిటైర్‌మెంట్‌ ఇచ్చారు, మరి కొందరు అందుబాటులో లేరు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో యంగ్‌ ఇండియా టీమ్‌ జింబాబ్వే చేరుకుంది. ఇందులో దాదాపు ఐదు మంది తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న వారున్నారు.
వీరిలో టీ20ల నుంచి తప్పుకున్న రోహిత్‌, కోహ్లీ, జడేజాకు ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా ఎవరికి ఉంది? భారత జట్టులో చోటుని శాశ్వతంగా మార్చుకునే ట్యాలెంట్‌ ఎవరికి ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.

  • రోహిత్ ప్లేస్‌ ఎవరిది?
    ఓపెనర్‌గా దూకుడుగా ఆడే రోహిత్ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ చోటు కోసం యశస్వి జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ పోటీ పడుతున్నారు. మొదటి రెండు టీ20లకు జైస్వాల్‌ అందుబాటులో ఉండడు. ఐపీఎల్‌లో రుతురాజ్‌ 14 మ్యాచుల్లో 583 పరుగులు చేశాడు. గిల్ 12 మ్యాచుల్లో 426 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రుతురాజ్‌ చెన్నైకి ఓపెనర్‌గా మాత్రమే కాకుండా, ఫస్ట్‌ డౌన్‌లో ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌లో రాణించడంపై అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
  • అభిషేక్ శర్మ
    మొదటిసారి జాతీయ జట్టులో అభిషేక్‌ శర్మకు చోటు దక్కింది. అభిషేక్‌ ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయ్యాడు. ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ అత్యధిక స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు చేశాడు. 16 మ్యాచుల్లో ఏకంగా 484 పరుగులు చేశాడు. జింబాబ్వేపై కెప్టెన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉంది. అలానే అభిషేక్‌ అవసరం మేరకు బౌలింగ్‌ కూడా చేయగలడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే జట్టులో స్థానానికి ఢోకా ఉండదు.
  • రియాన్‌ పరాగ్‌
    టీమ్‌ మిడిల్ ఆర్డర్‌కు రియాన్‌ పరాగ్‌ గట్టి పోటీ ఇవ్వనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2023, ఐపీఎల్‌ 2024లో అదరగొట్టిన రియాన్‌ పరాగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. SMAT 2023లో అస్సాం తరఫున 85.00 యావరేజ్‌తో 510, ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్‌ తరఫున 573 పరుగులు చేశాడు. ఇతడు టాప్‌ ఆర్డర్‌లో విరాట్‌ కోహ్లీ లేని లోటును తీర్చగల సత్తా ఉందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం
  • ఆల్‌రౌండర్‌గా సుందర్‌కు ఛాన్స్‌
    జడేజా స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ పొజిషన్‌కు తానే అర్హుడునని అక్షర్‌ పటేల్ నిరూపించుకున్నాడు. అతడికి బ్యాకప్‌గా వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం ఉంది. బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఈసారి జింబాబ్వేపై మెరుగైన ప్రదర్శన చేస్తే భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవచ్చు.

    'ఆ డ్యాన్స్​ వెనక ఉన్న రహస్యం ఏంటి?' - మోదీ ప్రశ్నకు రోహిత్‌ ఇంట్రెస్టింగ్​ ఆన్సర్! - Rohith Modi

ABOUT THE AUTHOR

...view details