Kho Kho World Cup :ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Kho Kho Federation Of India) చరిత్రలోనే మొట్టమొదటి వరల్డ్ కప్ నిర్వహించనుంది. 2025లో భారత్ వేదికగానే ఖో ఖో వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ ఖో ఖో ఫెడరేషన్తో కలిసి భారత ఫెడరేషన్ ఈ వరల్డ్‌కప్ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నీలో 24 దేశాలు పాల్గొననున్నాయి. మొత్తం 16 పురుష, మహిళా జట్లు పోటీల్లో తలపడే అవకాశం ఉంది. 2032 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని ఖో ఖో ఇండియా ప్రకటన చేసింది.
'భారత్‌లో తొలి ప్రపంచకప్ నిర్వహించేందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ వరల్డ్‌కప్ కేవలం పోటీల కోసమే కాదు. ప్రపంచంలోని వివిధ దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చి, ఈ క్రీడకు విశ్వవ్యాప్తంగా క్రేజ్ తీసుకురావడమే మా లక్ష్యం. 2023 ఒలింపిక్స్‌లో ఖో ఖో ఆటను చూడడం మా కల. ఆ కల సాకారం చేసుకోవడానికి ఈ వరల్డ్‌కప్ నిర్వహణ తొలి అడుగు' అని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుదాంశూ మిత్తల్ (Sudhanshu Mittal) పేర్కొన్నారు.
50 లక్షల టార్గెట్
అయితే ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటను మరింత ఎక్కువ మందికి చేరేలా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 నగరాల్లో 200 పాఠశాలలల్లో ఖో ఖో గేమ్‌ను ప్రమోట్ చేయాడానికి ప్లాన్ చేస్తోంది. వరల్డ్‌కప్ పోటీలకు ముందు ఓ స్పెషల్ డ్రైవ్‌తో దేశంలో కనీసం 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.