తెలంగాణ

telangana

ETV Bharat / sports

మినీటోర్నీలో టీమ్ఇండియా జర్నీ- ఆ 3ఎడిషన్లలో హార్ట్​బ్రేక్! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

India T20 World Cup Journey: 9వ ఎడిషన్ టీ20 వరల్డ్​కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మరోసారి టైటిల్ ఫేవరెట్​గా టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. మరి గడిచిన 8 ఎడిషన్​లలో భారత్ జర్నీ ఎలా సాగిందంటే?

India T20 World Cup Journey
India T20 World Cup Journey (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 9:55 AM IST

Updated : May 30, 2024, 10:08 AM IST

India T20 World Cup Journey:2024 టీ20 వరల్డ్​కప్​కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటిదాకా 8 ఎడినషన్లు ముగించుకున్న, మినీ టోర్నీ ఇప్పుడు 9వ సీజన్​కు​ రెడీ అవుతోంది. ఈ టోర్నమెంట్​కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలిసారి టోర్నీలో అత్యధికంగా 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

అయితే 2007 తొలి ఎడిషన్​లో ఛాంపియన్​గా నిలిచిన భారత్ ఆ తర్వాత ఆడిన 7సీజన్​​లలో టైటిల్ నెగ్గలేకపోయింది. ఈ క్రమంలో భారత్ మరోసారి హాట్ ఫేవరెట్​గా బరిలోకి దిగనుంది. ఇక 11ఏళ్లుగా భారత్​కు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని ఈసారి ఎలాగైన దక్కించుకోవాలన్న కసితో టీమ్ఇండియా రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగనుంది. మరి పొట్టి ప్రపంచకప్​లో టీమ్ఇండియా జర్నీ గత ఎడిషన్లలో ఎలా సాగిందో మీకు తెలుసా?

  • 2007లో ఛాంపియన్​గా: ఐసీసీ తొలిసారి 2007లో టీ20 వరల్డ్​కప్​ నిర్వహించింది. ఎమ్​ఎస్ ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆ సీజన్​లో అదరగొట్టింది. తొలి ఎడిషన్​లోనే ఫైనల్​కు చేరిన టీమ్ఇండియా తుదిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​లో తలపడింది. ఈ మ్యాచ్​లో భారత్ 5 పరుగుల తేడాతో నెగ్గి పొట్టికప్​ను సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డు కొట్టింది.
  • 2009: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఎన్నో అంచనాలతో రెండో ఎడిషన్​ (2009)లో టీమ్ఇండియా బరిలోకి దిగింది. లీగ్ స్టేజ్​లో తొలి రెండు మ్యాచ్ (బంగ్లాదేశ్, ఐర్లాండ్)​ల్లో నెగ్గినా తర్వాత వరుసగా మూడు మ్యాచ్​ల్లో (వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా) ఓడి నాకౌట్​కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ సీజన్​ ఫైనల్​లో శ్రీలంకపై పాకిస్థాన్ నెగ్గింది.
  • 2010: అయితే 2011లో వన్డే వరల్డ్​కప్ నేపథ్యంలో మూడో ఎడిషన్ టీ20 చోర్నీని ఓ ఏడాది ముందే నిర్వహించారు. ఈ టోర్నీలో భారత్ తొలి రెండు మ్యాచ్​ల్లో నెగ్గి, తర్వాత వరుసగా రెండు గేమ్​లలో ఓడి సెమీస్​కు చేరకుండానే నిష్క్రమించింది.
  • 2012: గతేడాది వన్డే వరల్డ్​కప్ నెగ్గిన జోష్​లో 2012లో టీ20 ప్రపంచకప్​ బరిలో దిగిన భారత్ తృటిలో సెమీస్ అవకాశాన్ని చేజార్చుకుంది. సూపర్ 8లో నాలుగింట మూడు మ్యాచ్​ల్లో నెగ్గినా రన్​రట్​ కారణంగా సెమీస్ చేరలేదు. ఈ టోర్నీలో విండీస్ తొలిసారి కప్పు ముద్దాడింది.
  • 2014: ఈ ఎడిషన్​లో టీమ్ఇండియా అంచనాలకు తగ్గట్లు ప్రదర్శన చేసింది. లీగ్ స్టేజ్, సూపర్ 4లో రాణించి ఫైనల్​కు దూసుకెళ్లింది. కానీ, తుదిపోరులో శ్రీలంకతో తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 130-4 స్కోర్ చేయగలిగింది. ఛేదనలో శ్రీలంక 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకొని తొలిసారి పొట్టికప్ సాధించింది.
  • 2016: 2016లోనూ భారత్ లీగ్ స్టేజ్​లో అదరగొట్టింది. దూకుడుగా ఆడుతూ వరుస విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్​లో వెస్టిండీస్​తో పోడిపడ్డ టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 192-2 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఛేదనలో విండీస్ 19-2కే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ గెలుపు ఖాయమని అనుకున్నారంతా. కానీ, లెండిల్ సిమన్స్ అద్భుత పోరాటం (82*)తో విండీస్​ను ఫైనల్​ చేర్చాడు.
  • 2021: దాదాపు 5 ఏళ్ల తర్వాత జరిగిన టోర్నీలో భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్​గా బరిలో దిగినా సెమీస్ చేరలేదు. 5మ్యాచ్​ల్లో మూడు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో మరోసారి భారత్​కు పరాభవం తప్పలేదు. సెమీస్​కు చేరకుండానే నిష్క్రమించింది.
  • 2022: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ సెమీస్​కు అర్హత సాధించింది. అయితే సెమీ ఫైనల్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 168-6 స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కోల్పోకుండా టార్గెట్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా ఫైనల్​కు చేరకుండానే ఇంటిబాట పట్టింది.

అలా గత 8 ఎడిషన్లలో ఒకసారి టైటిల్ నెగ్గిన టీమ్ఇండియా ఓసారి ఫైనల్ (2014), రెండుసార్లు సెమీస్ (2016, 2022) చేరింది. ఇక రెండో టైటిల్ సాధించాలన్న ఆశయంతో భారత్ మరోసారి బరిలో దిగుతోంది. ఈ సీజన్​లో జూన్ 5న ఐర్లాండ్​తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

పొట్టికప్​లో కోహ్లీయే టాప్ స్కోరర్- రోహిత్ ప్లేస్ ఎంతంటే? - T20 World Cup 2024

టీమ్ఇండియా కొత్తకోచ్​గా గంభీర్- అనౌన్స్​మెంటే లేట్!

Last Updated : May 30, 2024, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details