Fake D-Mart Ads in Instagram : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి డీమార్ట్ ప్రకటన చూసి తన క్రెడిట్‌కార్డు వివరాలను ఆలోచించకుండా సైబర్ నేరగాళ్లకు చెప్పి రూ. 81 వేలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం సైనిక్‌పురి అంబేడ్కర్ నగర్‌లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి ఆదివారం (జనవరి 19న) మొబైల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడుతూ డీమార్ట్ యాడ్ చూశాడు.
కొన్ని వస్తువులు తక్కువధరకే వస్తున్నాయని సైబర్ నేరగాళ్లు ఆ ప్రకటనలో ఇచ్చారు. అదిచూసి ఆశపడిన అతను అందులోని కొన్ని వస్తువులను వెంటనే ఆర్డర్ పెట్టాడు. సైబర్ నేరగాళ్లు అతనికి ఫోన్ చేసి అందుకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ వివరాలు చెబితే ఆర్డర్ పెట్టిన వస్తువులను పంపిస్తామని చెప్పారు. దీంతో అతను ఆలోచించకుండా క్రెడిట్ కార్డ్ వివరాలు చెప్పేశాడు. క్షణాల్లో అతని ఖాతా నుంచి రూ.81 వేలు కట్ అయ్యాయి. కొద్ది సేపు అనంతరం తాను మోసపోయానని గ్రహించి ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు.
మేము చెప్పినట్టు చేయండి అధిక లాభాలు వస్తాయన్నారు - రూ.2.43 కోట్లు కొట్టేశారు
ఆశతో పెట్టుబడి - మోసాలకు పట్టుబడి - రూ.2.43 కోట్లు పోగొట్టుకున్న ఉద్యోగి, శాస్త్రవేత్త