తెలంగాణ

telangana

ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పర్వం - ఇప్పటివరకు ఎన్ని గెలిచిందంటే? - Paris Olympics 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 7:14 AM IST

Updated : Jul 19, 2024, 7:34 AM IST

India Medals In Olympics : భారత్​లోనే కాదు విదేశాల్లోనూ మన క్రీడాకారులు తమ ట్యాలెంట్​తో సత్తా చాటారు. ముఖ్యంగా ఒలింపిక్స్​లో భారత్​కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు ప్లేయర్స్. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఎన్ని పతకాలు గెలిచిందంటే?

Paris Olympics 2024
Olympics (Getty Images)

India Medals In Olympics :పారిస్‌ వేదికగా 2024 ఒలింపిక్స్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇందులో వివిధ దేశలకు చెందిన ప్లేయర్లు పతకాల వేట కోసం బరిలోకి దిగనున్నారు. అయితే ఈ సారి భారత అథ్లెట్లు ఎక్కువ పతకాలు సాధిస్తారన్న అంచనాలు క్రీడాభిమానుల్లో నెలకొంది. వాస్తవానికి భారతదేశం ఒలింపిక్స్‌లో స్వాతంత్య్రానికి ముందు 1900 నుంచే పాల్గొంటోంది. అప్పటి నుంచి 25 సమ్మర్ ఒలింపిక్స్‌లో మొత్తం 35 పతకాలు గెలుచుకుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు కొల్లగొట్టే లక్ష్యంతో బరిలో దిగుతోంది.

మొత్తం పతకాల సంఖ్యలో భారత్‌ సాధించిన సంఖ్య అంతగా ఆకర్షణీయంగా లేనప్పటికీ, ఆల్-టైమ్ టేబుల్లో మన పేరు 57వ స్థానంలో ఉంది. అలానే భారత్​ ఎప్పుడూ వింటర్ ఒలింపిక్స్ పతకాలు గెలవలేదు. ఇక 1896, 1904, 1908, 1912 సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనలేదు. ఇక ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రస్థానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

1900 పారిస్ ఒలింపిక్స్
బ్రిటీష్ పాలనలో ఉండగానే 1900లో భారత్​ ఒలింపిక్ అరంగేట్రం చేసింది. కోల్‌కతాలో జన్మించిన నార్మన్ ప్రిచర్డ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్​గా చరిత్రకెక్కాడు. అతడు రెండు రజత పతకాలు (పురుషుల 200మీ హర్డిల్స్, 200మీ స్ప్రింట్) సాధించాడు. ఇది భారత​ ఒలింపిక్ ప్రయాణానికి నాంది పలికింది.

  1. కేడీ జాదవ్ - బ్రాంజ్‌ - పురుషుల రెజ్లింగ్ (బాంటమ్ వెయిట్)
  2. లియాండర్ పేస్ - టెన్నిస్ పురుషుల సింగిల్స్- బ్రాంజ్‌ (16 ఏళ్ల తర్వాత, పురుషుల టెన్నిస్‌లో వచ్చిన బ్రాంజ్‌ ఇది. భారత్​కు మూడో వ్యక్తిగత ఒలింపిక్ పతకం.
  3. కరణం మల్లీశ్వరి - వెయిట్ లిఫ్టింగ్ (54 కేజీలు)-బ్రాంజ్‌ ( వెయిట్ లిఫ్టింగ్​లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ)
  4. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ -డబుల్ ట్రాప్ షూటింగ్ -సిల్వర్ (భారత్​ తొలి షూటింగ్ పతకం)
  5. అభినవ్ బింద్రా - 10 మీటర్స్​ ఎయిర్ రైఫిల్ షూటింగ్ - గోల్డ్
  6. విజేందర్ సింగ్ - పురుషుల మిడిల్ వెయిట్ బాక్సింగ్ - బ్రాంజ్‌
  7. సుశీల్ కుమార్ - రెజ్లింగ్ (ఫ్రీస్టైల్ 66 కేజీలు)- బ్రాంజ్‌
  8. గగన్ నారంగ్- 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ - బ్రాంజ్‌
  9. విజయ్ కుమార్ - 25 మీటర్స్​ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ - సిల్వర్
  10. సైనా నెహ్వాల్- బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ - బ్రాంజ్‌
  11. మేరీ కోమ్ - ఫ్లైవెయిట్ బాక్సింగ్ - బ్రాంజ్‌
  12. యోగేశ్వర్ దత్- రెజ్లింగ్ (ఫ్రీస్టైల్ 60 కేజీలు) - బ్రాంజ్‌
  13. సుశీల్ కుమార్ - రెజ్లింగ్ (ఫ్రీస్టైల్ 66 కేజీలు)- సిల్వర్
  14. సాక్షి మాలిక్ - మహిళల రెజ్లింగ్ (58 కేజీలు) - బ్రాంజ్‌
  15. పీవీ సింధు - బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ - సిల్వర్
  16. మీరాబాయి చాను - వెయిట్ లిఫ్టింగ్ (49 కేజీలు) - సిల్వర్
  17. పీవీ సింధు- బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ - బ్రాంజ్‌
  18. లోవ్లినా బోర్గోహైన్ - మహిళల వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ - బ్రాంజ్‌
  19. పురుషుల హాకీ జట్టు -కాంస్యం
  20. రవి కుమార్ దహియా - రెజ్లింగ్ (ఫ్రీస్టైల్ 57 కేజీలు)- సిల్వర్
  21. బజరంగ్ పునియా- రెజ్లింగ్ (ఫ్రీస్టైల్ 65 కేజీలు)- బ్రాంజ్‌
  22. నీరజ్ చోప్రా - జావెలిన్ త్రో - గోల్డ్

ఒలింపిక్స్​లో హాకీ జర్నీ
దిగ్గజ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ నేతృత్వంలోని పురుషుల హాకీ జట్టు తొలిసారిగా స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విజయంతో హాకీలో వరుసగా ఆరు బంగారు పతకాల పరంపర మొదలైంది.1932 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్​లో స్వర్ణం, 1936 బెర్లిన్ ఒలింపిక్స్​లో స్వర్ణం, 1948 లండన్ ఒలింపిక్స్​లో స్వర్ణం, 1952 హెల్సింకి ఒలింపిక్స్​లో స్వర్ణం, 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్​లో స్వర్ణం, 1960 రోమ్ ఒలింపిక్స్​లో రజతం,1964 టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం,1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్​లో కాంస్యం, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్​లో కాంస్యం, 1980 మాస్కో ఒలింపిక్స్​లో స్వర్ణం ఇలా హాకీలో మన భారత్ జర్నీ సక్సెస్​ఫుల్​గా సాధించింది.

2008 బీజింగ్ ఒలింపిక్స్
షూటింగ్‌లో అభినవ్ బింద్రా తొలి వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు. దీంతో సహా భారత్ మూడు పతకాలు సాధించింది.

2012 లండన్ ఒలింపిక్స్
భారత్ ఈ ఒలింపిక్స్‌లో అత్యధికంగా ఆరు పతకాలు గెలిచింది. అత్యుత్తమ ఒలింపిక్ ప్రదర్శనను సాధించింది.

2016 రియో డి జనీరో ఒలింపిక్స్
ఇందులో భారతదేశం రెండు పతకాలు గెలుచుకుంది. పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో తన మొదటి ఒలింపిక్ పతకాన్ని సంపాదించింది. సాక్షి మాలిక్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది.

2020 టోక్యో ఒలింపిక్స్ -ఈ ఈవెంట్​లోఅథ్లెట్లు ఏకంగా ఏడు పతకాలు సాధించారు. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు.

రోప్ క్లైంబింగ్​, టగ్​ ఆఫ్ వార్ - ఒలింపిక్స్​లోని ఈ విచిత్రమైన క్రీడల గురించి తెలుసా? - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్​కు 117 మంది భారత అథ్లెట్లు - ఆమె మాత్రమే మిస్సింగ్ - Paris Olympics 2024

Last Updated : Jul 19, 2024, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details