ETV Bharat / entertainment

'మత్తువదలరా 2'కు సెలబ్రిటీలు కూడా ఫిదా! మెగా స్టార్​, సూపర్​ స్టార్ రివ్యూస్​ ఇలా!! - Mathu Vadalara 2 Celebrities Review - MATHU VADALARA 2 CELEBRITIES REVIEW

Mathu Vadalara 2 Celebrities Review : కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కి ప్రేక్షకులను అలరిస్తున్న 'మత్తు వదలరా 2' సినిమా గురించి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే సూపర్ స్టార్ మహేశ్​ బాబు తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే?

Mathu Vadalara 2 Celebrities Review
Mathu Vadalara 2 Celebrities Review (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 9:27 AM IST

Mathu Vadalara 2 Mahesh Babu Review : యంగ్ హీరో శ్రీ సింహా లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'మత్తు వదలరా 2' ఇప్పుడు పాజిటివ్​ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. కామెడీ ఎంటర్​ట్రైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఈ సినిమా గురించి చేసిన పోస్ట్​లు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

'రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేశారు'
రీసెంట్​గా మత్తు వదలరా గురించి చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆయన మూవీ టీమ్​ను ప్రశంసించిన తీరు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

"నిన్ననే మత్తు వదలరా 2 చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్​ని కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా రితేశ్​ రానాకి ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హాట్స్ ఆఫ్ రితేశ్​ రానా. నటీనటులకు, సింహ, ప్రత్యేకించి సత్యకి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవలకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు, టీమ్​ అందరికీ నా అభినందనలు. అస్సలు మిస్ అవ్వకండి మత్తు వదలరా 2 సినిమా వంద శాతం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్" అని చిరు తన అభిప్రాయాన్నితెలియజేశారు.

'ఆ ఇద్దరిని చూసి నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది'

'మత్తు వదలరా 2' సినిమా చాలా ఎంటర్​టైనింగ్​గా ఉందని , ఈ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ చూశానంటూ మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. హీరో శ్రీ సింహతో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారంటూ ఆయన మెచ్చుకున్నారు.

"వెన్నెల కిశోర్ నువ్వు స్క్రీన్ మీద కనిపించినంత సేపు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్య నువ్వు సినిమాలో కనిపించినప్పుడల్లా మేమంతా నవ్వకుండా ఉండలేకపోయాం. అద్భుతంగా నటించారు. టీమ్ మొత్తానికి అభినందనలు" అంటూ మహేశ్ బాబు మూవీ టీమ్​ను అభినందించారు.

'మత్తువదలరా 3' రానుందా?
తాజాగా ఈ మూవీ సక్సెస్​ మీట్​ను నిర్వహించిన మేకర్స్​ ఓ స్పెషల్ అనౌన్స్​మెంట్​ను చేసి మూవీ లవర్స్​ను సర్​ప్రైజ్​ చేశారు. సక్సెస్​ మీట్​లో డైరెక్టర్ రితేశ్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. 'మత్తు వదలరా 2' సినిమాకు వచ్చిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషంగా ఉందని తెలిపిన ఆయన, ఈ సినిమాకు మూడో భాగాన్ని కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎప్పుడనే విషయాన్ని చెప్పలేనని కానీ తప్పకుండా 'మత్తు వదలరా 3'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని అన్నారు.

ఇది కాస్త మూవీ లవర్స్​లో ఎగ్జైట్​మెంట్ నింపింది. ఇప్పటికే విడుదలైన రెండు చిత్రాల పాజిటివ్ రిజల్ట్​ వల్ల ఈ మూడో భాగంపై మరింత అంచనాలు ఉండనున్నాయని నెటిజన్లు అంటున్నారు.

'మత్తు వదలరా 2' రివ్యూ - ఈ క్రైమ్, కామెడీ OTTలోకి ఎప్పుడంటే? - Mathu Vadalara 2 Review

శ్రీ సింహా, సత్య అదిరిపోయే కామెడీ టైమింగ్ - 'మత్తు వదలరా' ట్రైలర్ చూశారా? - MATHU VADALARA 2 TRAILER

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.