Rohit Sharma Test Records : కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమౌతోంది. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా చెన్నై చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే?
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుపై హిట్‌మ్యాన్ కన్నేశాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో ఇప్పటివరకు 84 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన టీమ్ఇండియా బ్యాటర్ల లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సెహ్వాగ్ (90 సిక్స్‌లు) టాప్‌లో ఉన్నాడు. అయితే రోహిత్ మరో 7 సిక్స్‌లు బాదితే టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న తరుణంలో రోహిత్ ఈ సిరీస్‌లోనే ఈ సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది! అయితే ప్రస్తుతం యాక్టీవ్ ప్లేయర్లలో మాత్రం రోహిత్ శర్మే టాప్‌లో కొనసాగుతున్నాడు.
టెస్టుల్లో అత్యధికి సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్లు
వీరేంద్ర సెహ్వాగ్ | 90 |
రోహిత్ శర్మ | 84* |
ఎమ్ ఎస్ ధోనీ | 78 |
సచిన్ తెందూల్కర్ | 69 |
రవీంద్ర జడేజా | 64* |
Rohit Test Career : కాగా, 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు 59 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 101 ఇన్నింగ్స్‌ల్లో 45.46 సగటున 4137 పరుగులు బాదాడు. ఇందులో 12 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 212.
Rohit Sharma is just 8 sixes away from surpassing Virender Sehwag to become India's top six-hitter in Test cricket.
— JaffaJester 😎 (@Jhakasjaffa) September 14, 2024
The Hitman is ready to unleash! 💥🚀 #SixMachine 🐐 pic.twitter.com/B1UPcbHr1D
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
టెస్టు సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన- భారత్‌కు రానున్న టీమ్ ఇదే