Ind vs BanTest Match Pitch : టీమ్ఇండియా స్వదేశంలో జరగనున్న బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది. సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇటీవల పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన బంగ్లాదేశ్‌ను టీమ్ఇండియా అస్సలు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లంతా ఇప్పటికే చెన్నై చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. అయితే ఈ సిరీస్‌లో బంగ్లా బ్యాటర్లకు చెక్ పెట్టేందుకు భారత్ అద్భుతమైన ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎర్రమట్టితో తయారుచేసిన పిచ్‌ను ఉపయోగించాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే బంగ్లాదేశ్ తమ దేశంలో ఎక్కువగా నల్లమట్టి పిచ్‌లపై ఎక్కువగా ఆడుతుంటుంది. ఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. చెన్నై చెపాక్ పిచ్ కూడా స్పిన్ బౌలింగ్‌కు సహకరిస్తుంది. ఇక కొంతకాలంగా బంగ్లా బ్యాటర్లు ఇలాంటి పిచ్‌లపై అదరగొడుతున్నారు. అలాగే వాళ్ల జట్టులో నాణ్యమైన స్పిన్ కూడా ఉంది. అందుకే ఈ మ్యాచ్‌కు ఎర్రమట్టి పిచ్‌ను వినియోగించి బంగ్లాకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు క్రీడావర్గాల సమాచారం.
ఆట సాగుతున్నా కొద్దీ ఎర్రమట్టి పిచ్‌లు పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికీ అనుకూలిస్తాయి. ఇందులో ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. దీంతో పేసర్లతో బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీమ్ఇండియాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ వంటి బౌలర్లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో బంగ్లాదేశ్ బ్యాటర్లకు సవాల్ ఎదురు కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ భారత్‌తో పోలిస్తే కాస్త బలహీనంగానే ఉంది.
కాగా, ప్రస్తుతం ప్రాక్టీస్ చేసేందుకు ఇరుజట్లకు కూడా నల్లమట్టి పిచ్‌నే కేటాయించినట్లు తెలిసింది. అయితే ఎర్రమట్టి పిచ్‌ను బంగ్లా నేరుగా మ్యాచ్‌లోనే ఎదుర్కోనుంది. ఈ పిచ్‌లు బ్యాటింగ్‌కు కూడా సహకరిస్తాయి. దీంతో ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నారట.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్, తాస్ సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్
ఆల్‌టైమ్ రికార్డ్‌పై రోహిత్ కన్ను - టీమ్ఇండియాలో ఒకే ఒక్కడు! - IND vs BAN 2024