ETV Bharat / sports

సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ- భారీ ఆధిక్యంలో ఇండియా A - Duleep Trophy 2024

Tilak Varma Duleep Trophy 2024: 2024 దులీప్ ట్రోఫీలో యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సెంచరీతో అదరగొట్టాడు. ఇండియా డి తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్​లో తిలక్ 111 పరుగులు బాది నాటౌట్​గా నిలిచాడు.

Tilak Varma Duleep Trophy
Tilak Varma Duleep Trophy (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 14, 2024, 6:21 PM IST

Tilak Varma Duleep Trophy 2024: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ 2024 దులీప్ ట్రోఫీలో సెంచరీతో అలరించాడు. ఈ టోర్నీలో ఇండియా ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్, రెండో రౌండ్‌లో భాగంగా ఇండియా డి తో మ్యాచ్​లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్​లో (111* పరుగులు ; 193 బంతుల్లో 9 x4) శతకం బాదాడు. ఓపెనర్ ప్రథమ్‌ సింగ్ (122; 189 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక ఇండియా ఎ రెండో ఇన్నింగ్స్​ను 380/3 వద్ద డిక్లేర్డ్ చేసింది.

దీంతో ఇండియా డికి 488 పరుగుల లక్ష్యాన్ని (ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 107 రన్స్ కలుపుకొని) నిర్దేశించింది. ఇక శనివారం ఆట ముగిసేసరికి ఇండియా డి 62/1 (19 ఓవర్లు) స్కోరుతో నిలిచింది. ఇండియా విజయానికి ఇంకా 426 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో యశ్‌ దూబె (15 పరుగులు), రికీ భుయ్ (44పరుగులు) ఉన్నారు. కాగా, ఓపెనర్ అథర్వ తైడే (0) డకౌటయ్యాడు. అతడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్​లో పెలిలియన్ చేరాడు.

కాగా, తొలి ఇన్నింగ్స్​లో ఇండియా ఎ 290-10 పరుగులకు ఆలౌటైంది. షమ్స్ ములాని (89 పరుగులు), తనుష్ కొటియాన్ (53 పరుగులు) ఇద్దరు అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లెవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే బౌలింగ్​లో సత్తా చాటిన ఇండియా ఎ మంచి ఆధిక్యం దక్కించుకుంది. ఇండియా డి జట్టును తొలి ఇన్నింగ్స్​లో 183-10 పరుగులకే పరిమితం చేసింది. దేవదత్ పడిక్కల్ (92 పరుగులు) ఒక్కడే రాణించాడు. ఖలీల్ అహ్మద్, అకిబ్ ఖాన్ తలో 3, ప్రసిద్ధ్ కృష్ణ, షమ్స్ మనలాని, తనుజ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

విజయం దిశగా ఇండియా సి
మరోవైపు ఇండియా బి తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా సి విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌ నైట్ స్కోరు 124/0తో శనివారం ఆటను కొనసాగించిన ఇండియా బి ఆట ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉంది. 51 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగించిన అభిమన్యు ఈశ్వరన్‌ (143*; 262 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే పోరాడుతున్నాడు.

ఇషాన్ బ్యాక్​ టు ఫామ్- రీ ఎంట్రీలో సెంచరీల మోత - Duleep Trophy 2024

ఇండియా బి గ్రాండ్ విక్టరీ- గిల్ జట్టుకు తప్పని ఓటమి - Duleep Trophy 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.