Neeraj Chopra Diamond League : తాజాగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన ఈ ప్రాతిష్టాత్మక పోటీలో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటె విసిరిన నీరజ్, కేవలం ఒక్క సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. దీంతో గ్రెనడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లతో తొలి స్థానాన్ని కైవసం చేసకుంది.
ఈ గేమ్‌లో తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్ ఆఖరి ప్రయత్నంలో 86.46 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 85.97 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. గతేడాది జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లోనూ నీరజ్‌కు రెండో స్థానమే దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు.
Olympic & World Champion from India 🇮🇳
— The Khel India (@TheKhelIndia) September 14, 2024
NEERAJ CHOPRA 🫶 pic.twitter.com/mupUJUyAUQ
అయితే జూరిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ పాల్గొనలేదు. అయినప్పటికీ అతడు 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ జాబితాలో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లు, జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ 21 పాయింట్లు, చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రో స్టార్ జాకుబ్ 16 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించి అనర్హతకు గురయ్యాడు.
ఇక భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండు ఒలింపిక్ పతకాలను దేశానికి అందించాడు. నీరజ్ దేశంలో ఉన్న అత్యంత సంపన్న అథ్లెట్లలో మొదటిస్థానంలో నిలిచాడు. 2024 నాటికి నీరజ్ ఆస్తి విలువ 4.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.38 కోట్లు). అలాగే మ్యాచ్ ఫీజు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా నెలకు రూ.30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు నీరజ్. దాదాపుగా ఈ ఆదాయమే నీరజ్‌కు ఏటా రూ.4 కోట్లకు వరకు వస్తుందని సమాచారం.
కపిల్ దేవ్ టు నీరజ్ చోప్రా - ఈ ప్లేయర్లు ఆర్మీ ఆఫీసర్లు కూడా! - Cricketers In Army
పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వ్యాల్యూ ఎంత పెరిగిందంటే? - Neeraj Chopra Brand Value