Old Couple Died of Drinking Poisonous Tea : కోతి చేష్టలు మనుషులను ఇబ్బందుల్లోకి నెట్టేయడమే కాదు, కొన్నిసార్లు ప్రాణాలు తీస్తుంటాయి. ఇలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. కోతి చేష్టలకు వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఇంతకూ ఆ కోతి ఏం చేసిందో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం మండలంలోని పల్లకడియంలో వెలుచూరి గోవిందు (70), వెలుచూరి అప్పాయమ్మ (64) దంపతులు ఉంటున్నారు. ఇద్దరు ఎంతో అప్యాయంగా ఉండేవారు. వీరి ఇంటి అవరణలో శుక్రవారం ఓ కోతి గుళికల ప్యాకెట్‌ను వదిలేసి వెళ్లింది. అప్పాయమ్మకు కంటి చూపు మందగించడంతో ఆ గుళికల ప్యాకెట్‌ను టీ పొడిగా భావించింది. వాటితో సాయంత్రం వేళ టీ పెట్టింది. ఆ టీని దంపతులిద్దరూ తాగారు. కాసేపటికి నోటి నుంచి నురగలు కక్కుతూ వారిద్దరూ కింద పడిపోయారు.
స్థానికులు గమనించి, వారిని రాజ మహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించారు. వీరికి ముగ్గురు సంతానం కాగా పెద్ద కుమారుడు రాజమహేంద్రవరంలోని అపార్టుమెంట్లలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకూ పెళ్లిళ్లు అయిపోయాయి. ఒక కుమార్తె కోటిపల్లి వెంకట లక్ష్మి భర్త మరణించడంతో పల్లకడియంలోనే ఒంటరిగా ఉంటుంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది వరకూ ఇలాగే చేయడంతో నమ్మి : గతంలోనూ ఓ కోతి ఇలాగే ఓ ప్యాకెట్ వీరి ఇంటి దగ్గర విడిచి వెళ్లిందని, దాన్ని దాచి అప్పట్లో అప్పాయమ్మ టీ పెట్టుకున్నారని, అదే భావనతో ఈ గుళికల ప్యాకెట్‌నూ టీ పొడి ప్యాకెట్ అనుకుని టీ పెట్టుకున్నారని, చివరకు అదే వారి పాలిట యమపాశమైందని వెంకటలక్ష్మి వాపోయారు.
రెండురోజుల క్రితం గృహప్రవేశం.. దంపతులు సజీవ దహనం.. పాపం కుమార్తె...
దుస్తులు ఆరేస్తుండగా భార్యకు కరెంట్ షాక్ - కాపాడబోయి దంపతుల మృతి