Asian Championship 2024 India:ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుతున్న భారత్, అదే ఊపులో కొరియాను మట్టికరిపించి టోర్నీలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సౌత్ కొరియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో టోర్నమెంట్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా భారత ఘనత సాధించింది.
టీమ్ఇండియాలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (9వ నిమిషం, 43వ నిమిషం) రెండు గోల్స్‌తో అదరగొట్టగా, అరైజీత్ సింగ్ (8వ నిమిషం) ఒక గోల్ సాధించాడు. అటు ప్రత్యర్థి జట్టు నుంచి గోల్‌ను జిహున్ యాంగ్ (30వ నిమిషం) ఒక్కడే గోల్ సాధించాడు. ఇక శనివారం టోర్నీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 14న భారత్- పాకిస్థాన్ పోటీపడనున్నాయి.
కాగా, ఈ టోర్నమెంట్లో భారత్ అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ విజయాలు నమోదు చేస్తుంది. తొలి మ్యాచ్‌లో చైనాపై (3-0), రెండో మ్యాచ్‌లో జపాన్‌పై (5- 1), మూడో మ్యాచ్‌లో మలేసియా (8-1) తేడాతో భారీ విజయాలు నమోదు చేసింది. చైనాపై సుఖ్‌జిత్ సింగ్ (14వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (27వ నిమిషం), అభిషేక్ (32వ నిమిషం) ఫీల్డ్ గోల్స్ చేసి సత్తాచాటగా, జపాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ (2వ నిమిషం), సంజయ్ (17వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (54వ నిమిషం), సుఖ్జీత్ (60వ నిమిషం) రాణించారు.