IND VS USA T20 World Cup 2024 :టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్ఇండియా వరుసగా మూడో విజయం సాధించింది. ఓటమెరుగని ఇరు జట్లు తలపడిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఏడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో 111 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా పోరాడుతున్న టీమ్ఇండియాకు 5 పరుగులు అదనంగా కలిసొచ్చాయి. అయితే ఈ విషయంపై తొలుత గందరగోళం నెలకొన్నా తర్వాత క్లారిటీ వచ్చింది. అనుకోకుండా వచ్చిన 5పరుగులను యూఎస్ఏను ఒత్తిడిలోకి నెట్టేశాయి.
5 పరుగులు ఎలా వచ్చాయంటే ?
15 ఓవర్లు పూర్తయ్యేసరికి మిగిలిన 30 బంతుల్లో టీమ్ఇండియాకు 35 పరుగులు కావాల్సి ఉంది. కానీ, అప్పటికే మరో ఓవర్ స్టార్ట్ చేయడానికి యూఎస్ఏ బాగా ఆలస్యం చేసింది. అలా 60 సెకన్ల ఆలస్యానికి ఐదు పరుగుల పెనాల్టీకి గురైంది. ఐసీసీ గతేడాది ప్రవేశపెట్టిన కొత్త రూల్ యూఎస్ఏకు తలనొప్పి తెచ్చిపెట్టింది.
అసలు ఆ రూల్ ఏంటి:
క్రికెట్ ఎంపవర్మెంట్ కంపెనీ అంగీకారం తెలిపి ట్రయల్ పద్ధతిలో ఈ రూల్ ప్రవేశపెట్టింది. పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ దీని ట్రయల్ పూర్తయింది. ఓవర్ల మధ్యలో తీసుకునే గ్యాప్‌ను రెగ్యూలేట్ చేయడానికే ఈ పద్ధతి మొదలుపెట్టారు. ఒక ఓవర్ పూర్తయి తర్వాతి ఓవర్ బౌలింగ్ వేయడానికి 60 సెకన్ల కంటే ఎక్కువ ఆలస్యం కాకూడదు. ఒకవేళ అలా ఒకే ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఆలస్యమైతే ఆ జట్టుకు 5పరుగుల పెనాల్టీ విధిస్తారు.