IND vs SA 3rd T20 2024 :సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడో టీ20కి సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా బుధవారం మూడో మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లోనెగ్గిన టీమ్ఇండియా, ఆపై ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ మ్యాచ్ ఓడితే సిరీస్ సాధించే ఛాన్స్ ఉండదు. అందుకని మూడో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో ముందడుగు వెయ్యాలని భారత్ భావిస్తోంది.
వాళ్లు ఈసారైనా
ఈ సిరీస్‌లో యువ ఆటగాడు ఆభిషేక్ శర్మ భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. కానీ, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడే స్వభావం ఉన్న అభిషేక్ అనవసర షాట్లకు పోయి, వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఇకనైనా అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే జట్టులో స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇప్పటిదాకా భారీ ఇన్నింగ్స్ రాలేదు. సూర్య కూడా వరుసగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌కు సహకరించే సెంచూరియన్ పిచ్‌పై సూర్య చెలరేగాల్సిన అవసరం ఉంది. మరో కుర్రాడు తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టచ్‌లోకి వచ్చాడు. వీళ్లలో ఏ ఒక్కరైనా రాణిస్తే, భారత్‌కు భారీ స్కోర్ ఖాయం.
కళ్లన్నీ అతడిపైనే
సౌతాఫ్రికా అంటే పేస్ పిచ్‌ల అడ్డా. అక్కడ పేసర్లదే హవా. కానీ, ఇప్పుడు అక్కడి పిచ్‌లు స్పిన్‌కు కూడా కొంత సహకరిస్తున్నాయి. ఆ సహకారాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గొప్పగా వినియోగించుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో 3, రెండో టీ20లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్ కూడా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.