IND VS NZ Rohith Sharma with Lady Fan : టీమ్ ఇండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ ఆటతీరుకు, విరాట్ ఆటతీరుతో పాటు స్టైల్ అండ్ ఆటిట్యూడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరు కనపడితే చాలు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు, ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ట్రై చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఎగబడుతుంటారు. అయితే తాజాగా ఓ మహిళా అభిమానితో రోహిత్ శర్మ ముచ్చటించాడు. ఆ సమయంలో సదరు మహిళ కోహ్లీ గురించి మాట్లాడగా, హిట్ మ్యాన్ చెప్పిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఏం జరిగిందంటే? -ప్రస్తుతం టీమ్ ఇండియా న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన మన వాళ్లు రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మ్యాచ్ పుణె వేదికగా జరగనుంది. ఈ క్రమంలోనే ఎమ్సీఏ స్టేడియంలో మనోళ్లు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. ఆ సమయంలోనే స్టేడియానికి వచ్చిన ఓ మహిళ అభిమాని రోహిత్‌తో మాట్లాడింది. ఆటోగ్రాఫ్ కావాలని అడిగింది. ఆమె అడిగిన తీరుకి రోహిత్ ముచ్చటపడి ఆగి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కానీ ఆమె చివర్లో 'విరాట్ కోహ్లీకి కూడా నేను పెద్ద ఫ్యాన్‌ను అడిగానని చెప్పండి' అంటూ హిట్ మ్యాన్‌తో చెప్పింది. అప్పుడు రోహిత్ కూడా సానుకూలంగా స్పందించాడు. 'తప్పకుండా చెబుతాను' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మహిళా అభిమానితో రోహిత్ సంభాషణ
మహిళా అభిమాని - రోహిత్ భాయ్, ప్లీజ్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి
రోహిత్ - వెయిట్, వస్తున్నాను.