తెలంగాణ

telangana

ETV Bharat / sports

నలుగురు భారత బ్యాటర్లు డకౌట్​, 34 రన్స్​కే 6 వికెట్లు డౌన్​ - 1969 తర్వాత ఇదే తొలిసారి - IND VS NZ FIRST TEST

తొలి ఇన్నింగ్స్​లో భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన న్యూజిలాండ్ బౌలర్లు!

IND VS NZ First Test
IND VS NZ First Test (source IANS)

By ETV Bharat Sports Team

Published : Oct 17, 2024, 12:52 PM IST

IND VS NZ First Test Four Batters Duck Out : స్వదేశంలో తిరుగులేదంటూ ప్రదర్శన చేసే టీమ్​ ఇండియాను మైండ్ బ్లాక్ అయ్యేలా దెబ్బ కొట్టారు న్యూజిలాండ్ బౌలర్లు. పరుగుల సంగతి తర్వాత, అసలు బంతిని ఎదుర్కోవడానికే భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తొలి ఇన్నింగ్స్​లో ఏకంగా నలుగురు స్డార్ బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే ఔట్ అవ్వగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్, కే ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అస్సలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరౌర్కీ (3/13), మ్యాట్ హెన్రీ (2/12), టిమ్ సౌథీ (1/8) భారత బ్యాటర్లను దారుణంగా దెబ్బకొట్టారు.

1969 తర్వాత ఇలా -లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 34 పరుగులే చేసింది. అయితే స్వదేశీ గడ్డపై అతి తక్కువ పరుగులకే ఆరు వికెట్లను కోల్పోవడం, భారత్‌కు ఇది రెండో సారి కావడం గమనార్హం. చివరి సారిగా 1969లో ఇలా జరిగింది. అప్పుడు కూడా న్యూజిలాండ్‌పైనే 27 పరుగులకే టీమ్ ఇండియా ఆరు వికెట్లను పోగొట్టుకుంది. అప్పుడు కూడా హైదరాబాద్‌ వేదికగానే ఆ మ్యాచ్‌ జరగడం గమనార్హం.

  • ఇంకా స్వదేశంలోనే 10 పరుగుల్లోనే టీమ్ ఇండియా ఏకంగా మూడు వికెట్లను కోల్పోవడం ఇది మూడోసారి. న్యూజిలాండ్​పైనే ఇన్ని సార్లు కూడా ఈ చెత్త రికార్డును టీమ్‌ ఇండియా నమోదు చేసింది.
  • 1999లో మొహాలీ స్టేడియం వేదికగా 7 పరుగులు, 2010లో అహ్మదాబాద్‌ వేదికగా 2 పరుగులకే టీమ్​ ఇండియా మూడు వికెట్లను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.

భారత్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్​ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డ్​ - 8 ఏళ్ల తర్వాత వన్​డౌన్​లో!

ఈ భారత క్రికెటర్ల కెరీర్​లో​ ఆ చెత్త రికార్డ్​కు నో ప్లేస్​!

ABOUT THE AUTHOR

...view details