తెలంగాణ

telangana

ETV Bharat / sports

న్యూజిలాండ్​తో మూడో టెస్టు - పిచ్‌ విషయంలో టీమ్‌ ఇండియా కఠిన నిర్ణయం!

వాంఖడే వేదికగా జరగనున్న భారత్, కివీస్ మూడో టెస్టు - పిచ్​ను భిన్నంగా రూపొందించనున్న భారత్​!

IND VS NZ 3rd Test Pitch Details
IND VS NZ 3rd Test Pitch Details (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 29, 2024, 3:51 PM IST

IND VS NZ 3rd Test Pitch Details : స్వదేశంలో న్యూజిలాండ్​తో జరిగే మూడు టెస్టుల సిరీస్​ను టీమ్ ఇండియా సునాయాశంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, కివీస్‌ అనూహ్యంగా రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి భారత గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్​ను ఎగరేసుకుపోయింది. ఈ షాక్ నుంచి తేరుకున్న భారత్, ముంబయి వేదికగా జరిగే మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ముంబయి టెస్టులో గెలుపు టీమ్ ఇండియాకు చాలా కీలకంగా మారింది.

పిచ్ విషయంలో కీలక నిర్ణయం

ఈ క్రమంలోనే ముంబయి పిచ్‌ విషయంలో టీమ్‌ ఇండియా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, పుణె టెస్టుల్లో మొదటి రోజు నుంచే స్పిన్నర్లు చెలరేగి ఆడారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాంఖడే పిచ్​ను భిన్నంగా రూపొందిస్తున్నారని సమాచారం. పిచ్‌ తొలి రోజు నుంచే బ్యాటర్లకు అనుకూలించేలా తయారుచేస్తున్నారని తెలుస్తోంది.

'స్పోర్టింగ్ ట్రాక్- బ్యాటింగ్​కు అనుకూలంగా'
"ముంబయి పిచ్ ది స్పోర్టింగ్ ట్రాక్. ప్రస్తుతం పిచ్‌ పై కొంచెం పచ్చిక ఉంది. మొదటి రోజు బ్యాటింగ్ అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నాం. రెండో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందని భావిస్తున్నాం" అని క్రికెట్ వర్గాలు తెలిపారు.

వాంఖడేలో చివరి మ్యాచ్​లో ఏం జరిగిందంటే?
వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ చివరగా 2021 డిసెంబరులో టెస్టు మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్​లో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో టీమ్ ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. మొత్తం పది వికెట్లు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్​కే దక్కాయి. అనంతరం అశ్విన్ (4/8), సిరాజ్ (3/19), అక్షర్ పటేల్ (2/14) ధాటికి కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్​ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసింది. అజాజ్ పటేల్ 4, రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశారు. 540 పరుగులతో బరిలోకి దిగిన కివీస్ 167 రన్స్‌కు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు దక్కించుకున్నారు. దీంతో భారత్ 372 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

కీలకంగా మారిన మూడో టెస్టు
నవంబరు 1నుంచి ముంబయిలోని వాంఖడే వేదికగా టీమ్ ఇండియా, కివీస్ మూడో టెస్టులో తలపడనున్నాయి. ఇప్పటికే 0-2 తేడాతో సిరీస్ గెల్చుకున్న కివీస్, స్వదేశంలోనే టీమ్ ఇండియాను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. మూడో టెస్టులోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలబెట్టుకోవాలని భారత్ పోరాడుతోంది.


విరాట్​ను ఎగతాళి చేసిన ఆ ప్లేయర్ - బ్లాక్​ చేసిన కోహ్లీ!

'రాత్రికి రాత్రే ఛైర్మన్​ను కూడా మార్చేస్తారు!'- PCBపై బసిత్ అలీ హాట్ కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details