IND VS NZ 2nd Test Washington Sundar : దాదాపు 45 నెలల తర్వాత టెస్టు జట్టులోకి ఎంట్రీ వచ్చిన వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో బంతితో విజృంభించాడు. కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్ల (7/59)తో అదరగొట్టాడు. దీంతో పునరాగమనంలో అద్భుత ప్రదర్శన చేయడంతో సుందర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సుందర్ శ్రమించిన తీరును, సంకల్పం గురించి సుందర్ సోదరి శైలజ ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడింది. గాయాలైనా కూడా సుందర్ జట్టుకు 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని చెప్పింది. రవిచంద్రన్ అశ్విన్‌తో సుందర్‌ను పోల్చవద్దని, అలా చేయడం వల్ల సుందర్‌ను ఒత్తిడిలోకి నెట్టినట్టు అవుతుందని పేర్కొంది.
Washington Sundar :"గతంలో క్రికెట్‌లో ఫిట్‌నెస్ అనేది అంత పెద్ద విషయం కాదు. కానీ ఈ రోజుల్లో ఎంతో ముఖ్యం. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు. గాయపడినప్పుడు కూడా 100 శాతం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంటాడు. అతడి కఠోర శ్రమ, సాధనే ఈ రోజు విజయం సాధించడానికి దోహదపడ్డాయి.
గతంలో సుందర్ ఓ సారి సెంచరీని మిస్ చేసినప్పుడు, స్టూడెంట్ ఓ మార్క్ మిస్ చేస్తే అడిగినట్లుగా మా తండ్రి సుందర్‌ను సరదాగా ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఒకే ఇన్నింగ్స్‌లో సుందర్ ఏడు వికెట్ల ప్రదర్శన చేయడం చూసి మా కుటుంబం ఎంతో గర్వంగా సంతోషిస్తోంది. క్రికెట్‌లో టెస్ట్ ఓ స్వచ్ఛమైన ఫార్మాట్. ఆటగాడి నైపుణ్యాలు, ప్రదర్శనను పరీక్షిస్తుంటుంది.