తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో రోజు ఆట కంప్లీట్- భారీ ఆధిక్యం దిశగా కివీస్ - IND VS NZ 2ND TEST 2024

భారత్​- కివీస్ టెస్టు- రెండో రోజు ఆట కంప్లీట్- భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్

IND vs NZ 2nd Test 2024
IND vs NZ 2nd Test 2024 (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 25, 2024, 5:01 PM IST

IND vs NZ 2nd Test 2024 :భారత్ - న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్ 195-5తో ఉంది. ఓపెనర్ టామ్ లేథమ్ (86 పరుగులు; 133 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్ (9 పరుగులు), టామ్ బ్లండెల్ (30 పరుగులు) ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ 4, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 156 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్​లో అదరగొట్టిన భారత్, బ్యాటింగ్​లో తడబాటుకు గురైంది. 16-1 ఓవర్​నైట్ స్కోర్​తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా రెండో రోజు పెద్దగా రాణించలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (30 పరుగులు), శుభ్​మన్ గిల్ (30 పరుగులు), రవీంద్ర జడేజా (38 పరుగులు) ఫర్వాలేదనిపించారు. భారీ అంచనాలతో క్రీజులోకి దిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1) తీవ్రంగా నిరాశ పర్చాడు. మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా, గ్లెన్ ఫిలిప్ 2, టిమ్ సౌథీ 1 వికెట్ దక్కించుకున్నారు.

కాగా, తొలి ఇన్నింగ్స్​లోనే 103 పరుగుల ఆధిక్యం సంపాదించిన కివీస్, రెండో ఇన్నింగ్స్​లోనూ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయినా 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు కివీస్ ఎక్కువ సమయం బ్యాటింగ్ కొనసాగితే భారత్ ముంగిట భారీ టార్గెట్ ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే రెండో ఇన్నింగ్స్​లో కివీస్​ను వీలైనంత త్వరగా ఔట్ చేసి, బ్యాటింగ్​లో రాణిస్తేనే మ్యాచ్ నెగ్గే అవకాశం ఉంటుంది.

వారెవ్వా సుందర్

తొలి ఇన్నింగ్స్​లో 7 వికెట్లతో సత్తా చాటిన యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, రెండో ఇన్నింగ్స్​లోనూ అదరే ప్రదర్శన చేస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్​లో సుందర్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ప్రస్తుత చెస్టులో సుందర్ వికెట్ల సంఖ్య 11కు చేరింది.

స్కోర్లు

  • భారత్- 165-10 (తొలి ఇన్నింగ్స్​)
  • న్యూజిలాండ్- 256-10 & 198-5*

సొంతగడ్డపై భారత్ డీలా- 'పుజారా' కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్​!

0,1తో చెేతులెత్తేసిన రోహిత్, కోహ్లీ - కీలక మ్యాచుల్లో కుర్రాళ్లపై భారం!

ABOUT THE AUTHOR

...view details