తెలంగాణ

telangana

ETV Bharat / sports

బజ్‌బాల్‌కు కఠిన పరీక్ష - ఇంగ్లీష్ జట్టు పరిస్థితేంటో? - IND VS ENG Test Series BazBall

IND VS ENG Test Series BazBall : ఇంగ్లాండ్‌ బజ్​బాల్ వ్యూహం భారత పర్యటనలో పని చేయట్లేదు. దీంతో ఇంగ్లాండ్‌కు విమర్శల సెగ తప్పట్లేదు. ఇలాంటి స్థితిలో బజ్‌బాల్‌ వ్యూహానికి పరీక్షగా నిలవబోతున్నాయి సిరీస్‌లోని మిగతా రెండు టెస్టులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 9:31 AM IST

IND VS ENG Test Series BazBall :ఇంగ్లాండ్‌తో టెస్ట్​ అంటే ప్రత్యర్థి జట్లు తడబడేవి. ఎందుకంటే రెండేళ్ల నుంచి ఇంటా బయటా బజ్‌బాల్‌ వ్యూహంతో ఇంగ్లాండ్ దూకుడు ప్రదర్శిస్తూ ఆపోజిట్ టీమ్స్​ను చిత్తు చేసేది. ప్రతి బ్యాటర్‌ దూకుడుగా ఆడి రన్స్ చేయడం, ఎదురుగా ఉన్నది భారీ లక్ష్యమైనా డ్రా కోసం కాకుండా గెలుపు కోసమే ఆడుతూ ముందుకెళ్లడం, ఊహించని విధంగా డిక్లరేషన్లు ఇవ్వడం, ఎటాకింగ్‌ ఫీల్డింగ్‌తోనూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచడం వంటివి చేసి ఇంగ్లాండ్​ పైచేయి సాధిస్తూ వస్తోంది. బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్ అయ్యాక అతడు కొత్త కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌తో కలిసి రచించిన బజ్‌బాల్‌ వ్యూహమే దీనికి కారణం.

అయితే ఇప్పుడా బజ్‌బాల్‌ వ్యూహం టీమ్​ ఇండియాపై బెడిసికొడుతోంది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడింది కానీ ఆ తర్వాత రెండు మూడు టెస్టుల్లో నిలబడలేకపోయింది ఇంగ్లాండ్. ఎందుకంటే ఈ రెండు మ్యాచుల్లో యశస్వి జైశ్వాల్​ రెండు డబుల్ సెంచరీలతో వారిపై చేలరేగిపోయాడు. అలాగే రెండో టెస్ట్​లో బుమ్రా, మూడో టెస్ట్​లో జడేజా కూడా బంతితో ప్రత్యర్థి జట్టు పనిపట్టారు. దీంతో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్​ బోల్తా పడింది. మ్యాచ్ విజయం సాధించిడానికి అవకాశం ఉన్నపుడు దూకుడుగా ఆడాలి కానీ అలా లేనప్పుడు కూడా బజ్​బాల్​ వ్యూహంతో ఆడటం ఎందుకని అందరూ విమర్శిస్తున్నారు.

అయినా ఇలానే ఆడతాం : గతేడాది యాషెస్‌ సిరీస్​లో తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడం, పరోక్షంగా ఓటమికి దారి తీయడంతో బాగా విమర్శలు వచ్చాయి. అందరూ బజ్‌బాల్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. కానీ స్టోక్స్‌సేన వెనక్కి తగ్గకుండా అదే శైలిని కొనసాగించింది. ఆ యాషెస్​ సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఇప్పుడు టీమ్​ ఇండియాతో సిరీస్‌లో కూడా అలానే కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితి ఎదురవుతున్నా వెనక్కి తగ్గమని వారి కోచ్ చెబుతున్నారు. సిరీస్‌లో తాము కచ్చితంగా పుంజుకుంటామని, నాలుగో టెస్టును నెగ్గుతామని అంటున్నాడు. చూడాలి మరి రాంచి టెస్టులో ఇంగ్లాండ్‌ బజ్​బాల్​ వ్యూహం టీమ్​ ఇండియాను దెబ్బ తీస్తుందా? సిరీస్‌ను రసవత్తరంగా మారుస్తుందా? లేదంటే ఓటమిని అందిస్తుందా?

స్టోక్స్‌ చేతికి బంతి : ఇకపోతే టీమ్​ ఇండియాతో జరుగుతున్న ఈ టెస్ట్​ సిరీస్​లో బౌలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నాడు. జట్టు అవసరాల దృష్ట్యా చివరి రెండు టెస్ట్​ల్లో బంతిని పట్టుకోనున్నాడు. తాను బంతిని పట్టుకుంటే అదనంగా ఓ బ్యాటర్‌ లేదా స్పిన్నర్‌ను ఆడించే వీలుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అకాయ్‌ : కోహ్లీ - అనుష్క కొడుకు పేరుకు అర్థమేంటో తెలుసా?

మరోసారి తండ్రైన విరాట్- బాబు పేరేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details