IND vs ENG Ravichandran Ashwin 100 Test : టీమ్ ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ - ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోలకు(Jonny Bairstow 100 ) ఇది కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. మరి ఇప్పటికే సిరీస్‌ను 3-1తో దక్కించుకున్న టీమ్ ఇండియాకు ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మ్యాజిక్ చేసి ఇంకో విజయాన్ని అశ్విన్ అందిస్తాడా లేదా సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు బెయిర్‌స్టో బ్యాట్‌తో ఏమైనా తోడుగా నిలుస్తాడా అన్నది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
అశ్వినేమో అద్భుతంగా : ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా దక్కించుకోవడంలో స్పిన్నర్ అశ్విన్‌ది కీలక పాత్ర. ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టుల్లో అతడు మొత్తం 17 వికెట్లు దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ఈ సిరీస్‌లో ఒక ఆటగాడిగా తన కమిట్మెంట్ కూడా చాటుకున్నాడు. మూడో మ్యాచ్ మధ్యలో పర్సనల్ రీజన్స్‌తో టీమ్‌ను వీడినా వెంటనే తిరిగి వచ్చి ఆటలోకి దిగాడు. ఇక వందో టెస్టు రూపంలో అతడి ముంగిట ఇప్పుడో పెద్ద మైలురాయి నిలిచింది. మరి ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అశ్విన్ ఆఖరి టెస్టులోనూ అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాలని బలంగా కోరుకుంటున్నారు.
రీసెంట్గా టెస్టుల్లో అతడు 500 వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పుడేమో 100వ టెస్టు ఆడబోతున్న 14వ భారత ప్లేయర్‌గా నిలవబోతున్నాడు. అంతేకాదు తొలి తమిళనాడు క్రికెటర్‌గా కూడా నిలవనున్నాడు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్ తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టీమ్ఇండియా ఎన్నో విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. 23.91 యావరేజ్‌తో వికెట్లు తీశాడు. మరి ఐదో మ్యాచ్‌లోనూ అతడు మంచి ప్రదర్శన చేస్తే టీమ్ఇండియాకు తిరుగుండదు.