Ind vs Eng LBW Controversy: విశాఖపట్టణం వేదికగా జరిగిన భారత్- ఇంగ్లాండ్ టెస్టులో ఓ విషయంపై వివాదం చెలరేగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ ఎల్బీడబ్ల్యూ ఔట్ కాంట్రవర్సీగా మారింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఈ విషయంపై స్పందించాడు. జాక్ క్రాలీ ఔట్‌పై అసహనం వ్యక్తం చేస్తూ, కెమెరా యాంగిల్స్ (Hawkeye Technology) టెక్నాలజీ తప్పుగా ఉందని ఆరోపించాడు. దీనిపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. స్టోక్స్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
కెమెరా యాంగిల్స్ గురించి తెలుసుకోవాలంటూ స్టోక్స్‌కు ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇచ్చాడు. క్రాలీ ఔట్ విషయంలో కెమెరా టెక్నాలజీ, థర్డ్ అంపైర్ నిర్ణయం సరైనవేనని బదులిచ్చాడు.'మనం టీవీలో చూసే స్ట్రయిట్ కెమెరా వ్యూ ఎగ్జాక్ట్‌గా ఉండదు. హాక్- ఐ కెమెరా (Hawkeye Camera) స్టంప్స్‌కు సరిగ్గా స్ట్రయిట్ లైన్లో ఉంచుతారు. అక్కడ రెండు స్టంప్స్ కనిపించాయి. ఒకవేళ ఎక్స్ ట్రా కవర్స్ వైపు కెమెరా ఉంచినట్లైతే మూడు స్టంప్స్ కనిపిస్తాయి. కెమెరా యాంగిల్స్ అనేవి ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై ప్రభావం చూపవు. ఏదైనా మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని టెక్నాలజీ తప్పు ఉండదు. బ్రాడ్కాస్టింగ్పై అవగాహన ఉన్న వాళ్లకు ఈ టెక్నాలజీ గురించి తెలిసే ఉంటుంది' అని శాస్త్రి రిప్లై ఇచ్చాడు.