Ind Vs Eng 1st Test Day 3 Records :హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ (148*) అద్భుత పోరాటం వల్ల ఆ జట్టు కాస్త నిలదొక్కుకోగలిగింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 316/6 స్కోరుతో నిలిచింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 126 పరుగులకు చేరింది. మరోవైపు భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఇంగ్లీష్ జట్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ఆట ఎంతో రసవత్తరంగా సాగింది. అయితే ఈ వేదికగా తాజాగా పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే ?
స్టోక్స్ బౌల్‌కు అశ్విన్ షాక్ :శనివారం జరిగిన మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినన సమయానికి ఓపెనర్ జాక్ క్రాలే(31)ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. ఆ తర్వాతి ఆ తర్వాత బెన్ స్టోక్స్‌ను బౌల్డ్ చేసి రెండో తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బెన్ స్టోక్స్ వికెట్‌ను పన్నెండు సార్లు పడగొట్టి ఒకే బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. ఆయన పాకిస్థానీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను 12 సార్లు పెవిలియన్ బాట పట్టించాడు.
జడ్డూ రేర్ రికార్డు : మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఓ అరుదైన ఘనత సాధించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టోను ఔట్ చేసిన జడ్డూ, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అలా భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌ను జడ్డూ అధిగమించాడు. శ్రీ నాథ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 551 వికెట్లు పడగొట్టగా, జడేజా ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 332 మ్యాచ్‌లు ఆడి 552 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ జాబితాలో 953 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాన్ని అశ్విన్ 723 వికెట్లతో కైవసం చేసుకున్నాడు.