Ind vs Eng 1st Test 2024:ఉప్పల్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 420 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. భారత్ టార్గెట్ 230 పరుగులు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒలీ పోప్ ఒక్కడే 196 భారీ స్కోర్ నమోదు చేసి త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో రెహాన్ అహ్మద్ (28), టామ్ హార్ట్లీ (34) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, అశ్విన్ 3, జడేజా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నారు.
ఇక 316-6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో రోజు తొలి మొదటి సెషన్లోనే రెహన్ అహ్మద్‌ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ హార్ట్లీతో పోప్ అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ టీమ్ఇండియా బౌలింగ్ దళాన్ని దాటిగా ఎదుర్కొన్నారు. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ ఖాయమని అనిపించింది. ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. కానీ, అశ్విన్ చక్కని బంతితో హార్ట్లీనీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత ఓవర్లో మార్క్ వుడ్ (0)ను జడేజా, ఆ తర్వాత ఓవర్లో పోప్ (196)ను పేసర్ బుమ్రా వెనక్కిపంపి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు తెర దించాడు. ఒక పరుగు తేడాతో ఇంగ్లాండ్ చివరి మూడు వికెట్లు కోల్పోవడం గమనార్హం.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ (80), కేఎల్ రాహుల్ (86), రవీంద్ర జడేజా (87) హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా, శ్రీకర్ భరత్ (41), అక్షర్ పటేల్ (44) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూల్ 4, రెహన్ అహ్మద్ 2, టామ్ హార్ట్లీ 2, జాక్ లీచ్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఒకటిన్నర రోజు సమయంలో భారత్ గెలుపునకు 230 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాడ్ టార్గెట్ 10 వికెట్లు.
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 246-10