IND VS BAN First Test : చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టాప్-3 భారత స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ ఆరు పరుగులు మాత్రమే, వన్‌డౌన్ బ్యాటర్ గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కూడా ఆరు పరుగులకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. అయితే ఈ ముగ్గురిని బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహ్మద్ ఔట్ చేయడం విశేషం. రోహిత్ సెకెండ్ స్లిప్‌లో షాంటోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. శుభ్‌మన్, కోహ్లీ వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ చేతికి చిక్కారు.
ఇంతకీ హసన్ మహ్మద్ ఎవరంటే?(Who is Hasan Mahmud?)
హసన్ మహ్మద్ బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో 1999లో జన్మించాడు. ఇప్పుడు ఇతడి వయసు 24 ఏళ్లు. 2020లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 18 టీ20లు ఆడి 18 వికెట్లు తీశాడు. వన్డేల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. 22 వన్డేలు ఆడి 30 వికెట్లు పడగొట్టాడు.