IND VS BAN 3rd T20I : క్లీన్‌స్వీప్ లక్ష్యంగా చివరిదైన నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ కోసం టీమ్ ఇండియా బరిలో దిగుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా బంగ్లాతో తలపడనుంది. దీంతో దసరా రోజు మన యువ ఆటగాళ్లు ఎలాంటి పండగ విందును అందిస్తారో అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తుది జట్టులో మార్పులు -బంగ్లాపై ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన యువ భారత్ ఇప్పుడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడో మ్యాచ్ ఆడనుంది. విజయదశమి రోజు విజయాల జోరు కొనసాగించేందుకు పట్టుదలతో ఉన్నారు. దూకుడు ఆడుతున్న మన కుర్రాళ్లను అడ్డుకోవడం బంగ్లాకు అంత సులువు కాదనే చెప్పాలి. అయితే ఈ పోరు టీమ్ ఇండియా తుది జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకునే ఆస్కారం.
అతడిపైనే అందరి దృష్టి - టీమ్ ఇండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. గత మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పొగొట్టుకున్నప్పటికీ 222 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచిందంటే బలమైన బ్యాటింగ్ లైనప్పే కారణం. ఆ పోరులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar Innings) మెరుపు అర్ధశతకం (34 బంతుల్లో 74 పరుగులు)తో జట్టును ఆదుకున్నాడు. ఏడు సిక్సర్లు బాదిన అతడు బౌలింగ్‌లోనూ రాణించాడు. దీంతో ఇప్పుడు తెలుగు గడ్డపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న ఈ విశాఖ కుర్రాడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు ఉప్పల్ స్టేడియంలో సత్తాచాటాడు.
యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 249.12 స్ట్రైక్‌రేట్‌తో 284 పరుగులు సాధించాడు. ఇప్పుడీ మ్యాచ్‌లో అతడు కూడా రెచ్చిపోతే జట్టుకు బాగా కలిసొస్తుంది. రింకూ సింగ్, హార్దిక్, పరాగ్ కూడా మంచి జోరు మీదున్నారు.
బౌలింగ్‌లోనూ టీమ్‌ఇండియా మంచి ప్రదర్శన చేస్తోంది. పేసర్లు అర్ష్‌దీప్, మయాంక్‌కు తోడు స్పిన్నర్లు వరుణ్, సుందర్ కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. గత మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏడుగురు బౌలర్లను ప్రయోగిస్తే, వారిలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక వికెట్ అయినా తీశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే చివరి టీ20 కోసం జట్టులో కొన్ని మార్పులు జరగొచ్చని తెలుస్తోంది. తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
వర్షం పడుతుందా? - గత రికార్డులు ఎలా ఉన్నాయి?