IND vs BAN Test 2024 :భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. పేస్‌కు అనుకూలిస్తున్న చెపాక్ పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగిపోయారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 4 వికెట్లతో అదరగొట్టాడు. షకిబ్ అల్ హసన్ (32 పరుగులు) టాప్ స్కోరర్. మిరాజ్ (27 పరుగులు), లిట్టన్ దాస్ (22 పరుగులు), నజ్ముల్ షాంటో (20 పరుగులు) విఫలమవగా, మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం లభించింది.
టీమ్ఇండియా పేస్ దళం బంగ్లాను తొలి నుంచే ఇబ్బంది పెట్టింది. తొలి ఓవర్ చివరి బంతికే బుమ్రా అద్భుతమైన స్వింగర్‌తో ఓపెనర్ షద్మాన్ ఇస్లామ్ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరో ఓపెనర్ జాకీర్ హసన్ (3 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంటర్నేషనల్ కెరీర్ ఘనంగా ఆరంభించాడు. కెప్టెన్ షాంటో (20) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా మన పేసర్లు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు.
భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా వరుసగా వికెట్లను చేజార్చుకుంది. షాంటోతోపాటు ముష్ఫికర్ రహీమ్ (8) ఔట్ కావడం వల్ల బంగ్లా ఇన్నింగ్స్ వేగంగానే కుప్పకూలుతుందని అంతా భావించారు. కానీ, షకిబ్ అల్ హసన్ (32), లిటన్ దాస్ (22) ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దర్నీ రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. ఆఖర్లో బుమ్రా, సిరాజ్ టెయిలెండర్ల వికెట్లు పడగొట్టి బంగ్లా ఇన్నింగ్స్‌కు ఫుల్స్టాప్ పెట్టేశారు.