IND vs BAN Test 2024 :భారత్ - బంగ్లాదేశ్ తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 308 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఇన్నింగ్స్‌లో 81-3 స్కోర్‌తో ఉంది. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి 227 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5 పరుగులు), విరాట్ కోహ్లీ (17 పరుగులు) మరోసారి నిరాశ పర్చారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33), రిషభ్ పంత్ (12) ఉన్నారు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 149 స్కోర్ వద్ద ఆలౌటైంది. చెపాక్ పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగిపోయారు. షకిబ్ అల్ హసన్ (32 పరుగులు) టాప్ స్కోరర్. మిరాజ్ (27 పరుగులు), లిట్టన్ దాస్ (22 పరుగులు), నజ్ముల్ షాంటో (20 పరుగులు) విఫలమవగా, మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓవర్‌నైట్ స్కోర్ 339-6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 37 పరుగులకే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ (113 పరుగుల), రవీంద్ర జడేజా (86 పరుగులు)తో ఆకట్టుకున్నారు.