Kohli Fire On Women Journalist :బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆసీస్ ప్లేయర్లతో వివాదానికి దిగిన సందర్భాలను చూశాం. కానీ ఈ సారి ఆసీస్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే? - ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. టాయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు గబ్బా నుంచి మెల్ బోర్న్‌కు చేరుకుంది. అయితే మెల్ బోర్న్ విమానాశ్రయానికి భార్య అనుష్క శర్మతో పాటు వామికా, అకాయ్‌లతో విరాట్ కోహ్లీ వెళ్లాడు.
అప్పుడు అక్కడే ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొందరు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుండగా - అనుష్క శర్మ, అకాయ్, వామికలతో కలిసి కోహ్లీ అటువైపు రావడం ఆసీస్ మీడియా చూసింది. దీంతో విరాట్ కుటుంబం ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్రయత్నించింది.