IND VS AUS 2nd Test Kohli Injured : టీమ్ ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అడిలైడ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. అయితే ఇప్పుడు టీమ్ ఇండియాతో పాటు కోహ్లీ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగించే విషయం ఒకటి బయటకు వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలికి బ్యాండేజీ వేసుకుని, ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. విరాట్ రెండో టెస్టులో ఆడతాడా? లేదా అని అభిమానులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ కుడి కాలు మోకాలి నొప్పితో కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం అందుతోంది. దీంతో మెడికల్ టీమ్ వచ్చి కోహ్లీకి చికిత్స చేసి అనంతరం మోకాలికి బ్యాండేజీ వేసినట్లు తెలిసింది.