IND VS Aus Border Gavaskar Trophy 2024 Tickets :టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా - టీమ్ఇండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. నవంబర్ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
5 టెస్టుల సిరీస్ - రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్ - IND VS Aus Border Gavaskar Trophy - IND VS AUS BORDER GAVASKAR TROPHY
IND VS Aus Border Gavaskar Trophy 2024 Tickets : చివరిసారిగా 1991-92 సీజన్‌లో టీమ్ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. మళ్లీ ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్ కోసం రికార్డ్ స్థాయిలో టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
![5 టెస్టుల సిరీస్ - రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్ - IND VS Aus Border Gavaskar Trophy source ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-07-2024/1200-675-21877801-712-21877801-1720182938203.jpg)
Published : Jul 5, 2024, 6:07 PM IST
అయితే డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా అందుకోవాలనేది టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ ప్లాన్. అందుకు ఈ టెస్టు సిరీస్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఫ్యాన్స్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. భారత అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్ జోన్స్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. అలానే స్డేడియాల్లో మ్యాచ్‌ను టీమ్ఇండియా ఫ్యాన్స్ ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కువ స్థాయిలో టికెట్లను అందుబాటులో ఉంచనుంది. గత సీజన్‌తో పోలిస్తే టికెట్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు వరకు అధికంగా ఉండనున్నాయట.