ETV Bharat / entertainment

SSMB నయా షెడ్యూల్​ - చిన్న బ్రేక్ తర్వాత సరికొత్తగా! - SSMB 29 SHOOTING UPDATE

SSMB నయా షెడ్యూల్​ - షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందంటే?

SSMB 29 Shooting Update
SSMB 29 Shooting Update (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2025, 12:32 PM IST

SSMB 29 Shooting Update : సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, డైరెక్టర్​ రాజమౌళి కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'SSMB 29'. గత నెలలో ప్రారంభమైన సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయతే గత కొంత కాలంగా బ్రేక్​లో ఉన్న మూవీ టీమ్ తాజాగా మళ్లీ సెట్లోకి అడుగుపెట్టింది. ఈ బ్రేక్​లో హీరోయిన్ ప్రియాంక చోప్రా తన సోదరుడి వివాహానికి వెళ్లగా, ఆ వేడుకలు పూర్తి కాగానే మళ్లీ ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఇక మిగతా టీమ్​ కూడా ఇప్పుడు నయా షెడ్యూల్ కోసం సెట్స్​లోకి చేరుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా కోసం తయారు చేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సమ్మర్​ కల్లా విదేశాల్లోనూ షూటింగ్​కు ప్లాన్​ చేస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.

ఆ స్టార్ హీరోకు మొదటి సినిమా!
ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. పృథ్వీతో మూవీ టీమ్ చర్చలు కూడా జరిపిందని, ఆయన ఓకే కూడా చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే పృథ్వీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో లేరని ప్రచారం సాగుతోంది. పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహాంను తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్. త్వరలోనే ఆయన షూటింగ్​లో పాల్గొననున్నారని సమాచారం.

మహేశ్- జక్కన్న కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్ అబ్రహాం కనిపిస్తే ఇదే ఆయనకు ఇదే తెలుగు చిత్రం అవుతుంది. జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా గతంలో 'కరమ్', 'బ్లాక్‌ బస్టర్', 'దోస్తానా' వంటి చిత్రాలలో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇందులో భాగం కానున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్లుగా ఆమె ఇటీవలే హైదరాబాద్​లో పలుచోట్లను సందర్శించారు. దీంతో ప్రియాంక ఈ ప్రాజెక్ట్‌ కోసమే హైదరాబాద్​ వచ్చారని కథనాలు వెలువడ్డాయి. అలాగే రాజమౌళి పెట్టిన వీడియోకు ప్రియాంక కామెంట్ పెట్టడం వల్ల ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు, రీసెంట్​గా ప్రియాంకకు లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఫారెస్ట్​లో హీరోల అడ్వెంచర్స్- ఇప్పుడు ఇదే టాలీవుడ్ ట్రెండ్‌

'రాజమౌళి సినిమాల్లో లాజిక్ ఉండదు- 'RRR' అలానే హిట్ అయ్యింది!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.