WTC 2025 Points Table :2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌పై విజయంతో పాయింట్ల శాతం మెరుగుపర్చుకొని టాప్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 71.67 పాయింట్ పర్సెంటేజీతో తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 62.50 పర్సెంటేజీతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా, తొలి రెండో స్థానాల్లో ఉన్న భారత్ - ఆసీస్ మధ్య దాదాపు 10 పర్సెంటేజీ తేడా ఉంది. అంటే ఆస్ట్రేలియా కంటే భారత్చాలా దూరంలో ఉంది. ఇక తాజా మ్యాచ్‌లో ఘోర ఓటమి మూటగట్టుకున్న బంగ్లాదేశ్ 39.29 పాయింట్ పర్సెంటేజీతో 6వ స్థానంలో ఉంది.
2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమ్ఇండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా అందులో ఎడింట్లో నెగ్గింది. మరో రెండు మ్యాచ్‌లు ఓడగా, ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు ఆసీస్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు నమోదు చేయగా, 3 మ్యాచ్‌ల్లో ఓడి, 1 డ్రా చేసుకుంది. ఇక న్యూజిలాండ్ 50.00 పాయింట్ శాతంతో మూడో ప్లేస్‌లో ఉంది. ఇక వరుసుగా శ్రీలంక (42.86 పర్సెంటేజీ), ఇంగ్లాండ్ (42.19 పర్సెంటేజీ), బంగ్లాదేశ్ (39.29), సౌతాఫ్రికా (38.89)తో ఉన్నాయి.
ఇక ప్రస్తుత సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ మరో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత న్యూజిలాండ్, భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో కివీస్‌తో టీమ్ఇండియా స్వదేశంలోనే 3 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విదేశీ గడ్డపై భారత్ 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇలా 2025 జనవరి దాకా టీమ్ఇండియా వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగుతుంది.