ICC Latest Rankings :ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. బుధవారం వచ్చిన ఈ ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంక్ ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఇప్పటి వరకూ రోహిత్ కెరీర్లో నమోదైన బెస్ట్ ర్యాంక్ ఇదే కావడం విశేషం.
అయితే అంతకుముందు విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.ఇప్పుడీ ర్యాంక్‌తో అంతకుముందు రెండో స్థానంలో ఉన్న యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కినెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రోహిత్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, ఐర్లాండ్ బ్యాటర్ టెక్టార్ ఉండగా, పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ మాత్రం నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు బౌలర్లలో సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, ఆ తర్వాతి పొజిషన్స్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్ జోష్ హాజిల్ వుడ్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ జంపా, టీమ్ఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా ఎనిమిదో స్థానంలో ఉండగా, మరో భారత బౌలర్ మహ్మద్‌సిరాజ్ ఐదు స్థానాలు దిగజారి పదో స్థానానికి పడిపోయాడు.