Hybrid Pitch Dharamsala:హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో భారతదేశపు తొలి 'హైబ్రిడ్ పిచ్'ను సోమవారం ఆవిష్కరించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, పలువురు క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్, ఓవల్ స్టేడియాల్లో ఇప్పటికే వినియోగిస్తున్న ఈ హైబ్రిడ్ పిచ్‌లను ఇప్పుడు భారత మైదానాల్లో పరిశీలించనున్నారు. మరి ఈ హైబ్రిడ్ పిచ్ అంచే ఏంటి? దీంతో లాభాలేంటో చూద్దాం.
అసలేంటీ హైబ్రిడ్ పిచ్:ప్రస్తుతం క్రికెట్లో నాన్ హైబ్రిడ్ పిచ్ (డస్ట్, గ్రీన్ పిచ్)లు వాడుతున్నారు. ఇందులో కొన్ని బ్యాటింగ్‌కు అనుకూలిస్తే, మరికొన్ని బౌలింగ్‌కు సహకరిస్తాయి. అలా కాకుండా క్రికెట్లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే పిచ్‌లు ఉంటే గేమ్ మజా వస్తుంది. అందుకోసం క్రికెట్ పిచ్‌లు తయారు చేసే సంస్థ 'సిస్‌గ్రాస్' (SIS Grass) ఈ హైబ్రిడ్ మోడల్ పిచ్‌లు రూపొందించింది.
ఈ పిచ్‌లను పూర్తిగా యూనివర్సల్ ఎలక్ట్రిక్ మషీన్తో తయారు చేస్తారు. ఇందులో సహజసిద్ధమైన గడ్డినే వాడతారు. ఇందులో కేవలం ఐదుశాతం పాలిమర్ ఫైబర్ కలిసి ఉంటుంది. దీంతో పిచ్‌లు చాలా సేపు పాటు తాజాగా ఉంటాయి. ఇది గేమ్ క్వాలిటీని పెంచుతుంది.