Types Of Cameras Used In Cricket : మన దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లేయర్‌ల ఫీజులే కాదు మ్యాచ్ నిర్వహణకు కూడా భారీగా ఖర్చు చేస్తారు. లైవ్ యాక్షన్‌ని ఎలాంటి అంతరాయాలు లేకుండా అభిమానులకు అందించేందుకు చాలా అడ్వాన్స్‌డ్ డివైజ్‌లు వినియోగిస్తారు. ఇందులో కెమెరాల పాత్ర కీలకం. మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయడంలోనే కాదు థర్డ్ అంపైర్‌లు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కెమెరా విజువల్స్‌పైనే ఆధారపడతారు.
బౌలర్, బ్యాటర్, కీపర్, అన్ని పొజిషన్‌లలోని ఫీల్డర్లు, అంపైర్‌లు, ప్రేక్షకులు, కామెంటేటర్‌లు ఇలా అన్ని యాంగిల్స్‌ని కెమెరాలు కవర్ చేస్తుంటాయి. క్రికెట్ మ్యాచ్‌లో అన్ని యాంగిల్స్‌ని, ప్రతి మూమెంట్‌ని క్యాప్చర్ చేయడానికి 30 కంటే ఎక్కువ కెమెరాలు అవసరం. వీటిలో ఎన్ని రకాల కెమెరాలు ఉంటాయి? ధర ఎంత? ఇప్పుడు చూద్దాం.
స్పైడర్ క్యామ్
క్రికెట్‌లో ఉపయోగించే అడ్వాన్స్‌డ్ కెమెరాల్లో స్పైడర్‌క్యామ్ ఒకటి. ఇది కేబుల్స్ సాయంతో ఫీల్డ్‌లో కదులుతుంది. ప్రతి మూమెంట్‌ని వివిధ కోణాల నుంచి క్యాప్చర్ చేస్తుంది. ఈ కెమెరా హై జూమ్ కెపాసిటీ కలిగి ఉంటుంది, చాలా దూరం నుంచి కూడా క్లియర్ ఫుటేజీని అందిస్తుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఆధారంగా దీని ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది.
హెల్మెట్ కెమెరా
హెల్మెట్ కెమెరాలను ప్లేయర్‌లు అంపైర్లు ధరిస్తారు. ఈ కెమెరాలు ఫస్ట్-పర్సన్ వ్యూని అందిస్తాయి. అభిమానులు మ్యాచ్‌ని బ్యాటర్ లేదా అంపైర్ దృష్టికోణం నుంచి చూడటానికి వీలు కల్పిస్తాయి.
బౌండరీ కెమెరాలు
వీటిని బౌండరీ లైన్ వద్ద ఉంచుతారు. క్యాచ్‌లు పట్టే సమయంలో, బౌండరీని ఆపేటప్పుడు ఫీల్డర్ కదలికలను క్యాప్చర్ చేస్తాయి. ఒక మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది బౌండరీ కెమెరాలు ఉపయోగిస్తారు.
స్టాండర్డ్ బ్రాడ్‌కాస్ట్ కెమెరా
ఈ కెమెరాని లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం ఉపయోగిస్తారు. మ్యాచ్‌ని హై-క్వాలిటీ విజువల్స్‌తో ప్రసారం చేస్తుంది. ఈ కెమెరా ఖరీదు రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు ఉంటుంది.